నేడు రాజమండ్రిలో జనసేన తెలుగుదేశం పార్టీ </em( Telugu Desam Party )సమన్వయ కమిటీ భేటీ జరగటం తెలిసిందే.రాజమండ్రి మంజీరా హోటల్ లో జరిగిన ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan )నారా లోకేష్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన కమిటీ సభ్యులు హాజరయ్యారు.
ఈ క్రమంలో వచ్చే ఎన్నికలలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి.? అనే దానిపై చర్చించడం జరిగింది.మొత్తం ఆరు అంశాలపై చర్చ జరిపారు.అదేవిధంగా మ్యానిఫెస్టో పై కూడా చర్చ జరగటం జరిగింది.అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ప్రజలకు చేయాల్సిన మంచి.
ఉమ్మడి కార్యాచరణ గురించి సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.ఈ క్రమంలో ఈ నెల 29,30,31 తేదీలలో ఉమ్మడి జిల్లాల వారీగా జనసేన తెలుగుదేశం పార్టీ( Janasena Telugu Desam Party ) జిల్లా స్థాయి నేతల సమావేశాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో నవంబర్ మొదటి తారీకు నుంచి మేనిఫెస్టో రూపొందించి ఇంటింటికి ప్రచారం చేపట్టాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.మూడు విడతలుగా కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఉమ్మడిగా పూర్తిస్థాయిలో ఎలా వెళ్లాలి.? అనే దాన్ని విషయంలో.రెండో భేటీలో నిర్ణయిస్తామని లోకేష్</em( Nara Lokesh ) పేర్కొన్నారు.దాదాపు మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది.భవిష్యత్తు ఎన్నికలలో ఎలా ముందుకు వెళ్లాలి.? ఎలా సుస్థిరమైన ప్రభుత్వం అందించాలి.? అనే దానిపై చర్చ జరిపినట్లు నేతలు తెలిపారు.







