వికారాబాద్ జిల్లా కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ ప్రాంతం రుణం తీర్చుకునే సమయం ఇచ్చిందన్న రేవంత్ రెడ్డి ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అని ఎప్పుడూ అనుకోవద్దని తెలిపారు.ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించి సోనియా గాంధీకి( Sonia Gandhi ) గిఫ్ట్ గా పంపాలన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.త్వరలో ఇక్కడికి సిమెంట్ ఫ్యాక్టరీ( Cement Factory ) రాబోతుందని వెల్లడించారు.పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయన్న ఆయన రియల్ ఎస్టేట్( Real Estate ) రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.భూములు ఇవ్వకపోతే పరిశ్రమలు రావని వెల్లడించారు.