పొద్దున్నే టిఫిన్ లోకి ఈ ఆహారపదార్ధాలు తీసుకోవద్దు

పొద్దున్నే టిఫిన్ లోకి ఏం తీసుకోవాలి? చాలామంది కి అర్థం కాని ప్రశ్న ఇది.ఉదయాన్ని ఆరోగ్యకరమైన అహారంతో మొదలుపెట్టాలి.

ఎందుకంటే మీరు ఫాస్ట్ ని బ్రేక్ చేస్తున్నారు.పనికో, చదువుకో వెళ్ళబోతున్నారు.

మీరు తీసుకున్న ఆహారం మీకు కంఫర్ట్ ని అందించాలి, అలాగే ఆరోగ్యాన్ని.అందుకే ఈ ఆహారపదార్ధాలను టిఫిన్ లోకి తీసుకోవద్దు.

* సాధ్యమైనంత వరకు పొద్దున్నే పండ్ల రసం తాగవద్దు.పండుని రసంగా మార్చినప్పుడు దాంట్లోని మినరల్ ప్రపోర్షన్ తగ్గిపోతుంది.

Advertisement

బ్రేక్ డవున్ వలన షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి.ఉదయాన్నే ఎక్కువ షుగర్ వద్దు.

అయితే యాంటిఆక్సిడెంట్స్ తో పాటు, విటమిన్ సి ఎక్కువగా లభించే నిమ్మరసం ఉదయాన్నే తీసుకుంటే మంచి లాభం.* చాలా ఇళ్ళలో, చెప్పాలంటే మన తెలుగు ఇళ్ళలో ఉదయం పూట స్పెసిఫిక్ గా టిఫిన్ చేసుకునే ఓపిక లేక, ఉదయం కూడా తెల్ల అన్నంతోనే పనికానిచ్చేస్తారు.

అలా చేయకూడదు.తెల్ల బియ్యంలో కాలరీలు అధికంగా ఉండటమే కాదు, షుగర్ లెవల్స్ కూడా ఉంటాయి.

రాత్రి వండిన అన్నం కూడా తీసుకోకూడదు.* ఫ్యాట్స్ ఎక్కువున్న ఆహారం, సింపుల్‌గా చెప్పాలంటే నూనే ఎక్కువగా వాడిన ఆహారపదార్ధాలకు ఉదయం పూటైన దూరంగా ఉండండి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ నటుడి భార్యకు ఫోన్ చేసి నటుడిని ఇరికించిన బాలయ్య.. బాలయ్యలో ఈ యాంగిల్ ఉందా?

పొద్దున్నే ఎక్కువ ఫ్యాట్స్ తీసుకోవడం వలన ఇన్సులిన్ లెవల్స్ ట్రాక్ తప్పి, భోజనంకి మధ్య మరో మీల్ కి స్పేస్ దొరకదు.అంటే పూరి, బజ్జి లాంటి టిఫిన్స్ కి బదులు, ఇడ్లీ, ఇంట్లో వేసుకునే దొశ లాంటి టిఫిన్స్ తీసుకోవాలి.

Advertisement

* పొద్దున్నే పండ్ల సలాడ్ కి బదులు, వెజిటబుల్ సలాడ్ తీసుకుంటే మేలు.పండ్ల సలాడ్ కి మరో సమయం కేటాయించండి.

* ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్, ఫ్రై చేసిన వంటకాలు, ఆమ్లేట్, బేక్డ్ ఫుడ్, గ్రేన్స్, కేక్స్ .‌.ఇవేవి వద్దు.

తాజా వార్తలు