ఇంటర్మీడియట్ విద్యలో సంస్కృతం తీసుకుని రావద్దు :ఎస్.ఎఫ్.ఐ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ద్వితీయ బాషగా సంస్కృతంను ప్రవేశ పెట్టాలనే ఆలోచనను ఇంటర్ బోర్డు విరమించుకోవాలని తెలుగు బాషాను రెండవ సబెక్టుగా కోనసాగించాలని భారత విద్యార్ధి ఫెడరేషన్ ఎస్ ఏఫ్ ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాని డిమాండ్ చేసింది, ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష్యా, కార్యదర్శులు ఆర్ ఎల్ మూర్తి, టి నాగరాజు లు ఒక ప్రకటన విడుదల చేశారు.

 Dont Include Sanskrit Subject In Intermediate Education Says Sfi Details, Sanskr-TeluguStop.com

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో ఎక్కువ మంది విద్యార్ధులు పేద విద్యార్ధులు, బడుగు, బలహీనవర్గాల విద్యార్ధులు చదువుకుంటున్నారని వారు పాఠశాల స్థాయిలో సంస్కృతం సబెక్టుగా లేదని ఇప్పుడు ఇంటర్ లో ప్రవేశ పెట్టడం కోసం సంస్కృతం అధ్యాపక పోస్టులు భర్తీ చేసి ఈ సబెక్టు ప్రవేశపెట్టడం అంటే మాతృభాషను అవమానించడంమేనని, దక్షణాదిలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ మాతృభాషను కాపాడుకోవడం కోసం సిలబస్ మొత్తమే మాతృభాష ఉపయోగిస్తుంటే, తెలంగాణ మాత్రం దానికి భిన్నంగా ఉందన్నారు.

ఈ కోర్సు చదవడం మూలంగా ఎలాంటి ఉఫాధిని విద్యార్ధులు పోందలేరని, ఇంటర్మీడియట్ తర్వాత చదవడానికి ఉన్నత విద్యకు సంస్కృతం ఉపయోగ పడదని కేవలం ర్యాంకులు, మార్కులు కోసం తీసుకుని వస్తున్న సంస్కృతం విద్యార్దులులో శాస్ర్తియ విద్య స్థానంలో మూఢవిశ్వాశాలు పెంపోందిస్తుందని అన్నారు.తక్షణమే ఇంటర్మీడియట్ బోర్డు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube