గుంటూరు జిల్లా చిలకలూరిపేట పల్నాడు జిల్లా చిలకలూరిపేట లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పత్తిపాటి పుల్లారావు జిల్లాల విభజనలో ప్రజల సూచనలను తీసుకోకుండా అసంబద్ధంగా చేశారు: ప్రత్తిపాటి రాష్ట్రంలో ఎడాపెడా విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు: ప్రత్తిపాటి ఇప్పటికీ విద్యుత్ చార్జీలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచారు.
వేసవి తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు సమయపాలన లేని కరెంటు కోతతో ఉడికి పోతున్నారు.
నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు చంద్రబాబు ఐదేళ్ల పాలన ఇన్వర్టర్ అవసరం లేకుండా విద్యుత్ సరఫరా సాగింది జగన్మోహన్ రెడ్డి తప్పుడు నిర్ణయాలు.తప్పుడు సలహాల కారణంగా పీపీఏలు రద్దు చేసుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది ఇతర రాష్ట్రాలలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి పవర్ ప్రాజెక్టులకు సంబంధించి పిపీఎ లు రద్దు చేశారా.? ప్రత్తిపాటి ఇక్కడ రద్దు చేసిన దానికన్నా ఎక్కువ రేటుకు పీపీఏలు చేసుకున్న సీఎం సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలన పై బాదుడే బాదుడు పేరుతో ఆయన చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తాం పెరిగిన నిత్యావసరాలు, విద్యుత్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో రాష్ట్రంలో ఒక కుటుంబానికి లక్ష రూపాయల అదనపు భారం పడుతుంది.
వైకాపా ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది పంచాయతీ తీర్మానాలు లేకుండానే ఖాతాల లో డబ్బు మాయం అవుతుంది 14, 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు జనరల్ ఫండ్ కూడా వైకాపా ప్రభుత్వం లాగేసుకుంటుంది కనీసం గ్రామాల్లో తాగునీరు పారిశుద్ధ్యం విద్యుద్దీపాల సమస్యలు పరిష్కరించే పరిస్థితి లేదువైకాపా సర్పంచులు కూడా ప్రభుత్వాన్ని తిట్టుకునే పరిస్థితి వచ్చింది మూడేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్ లో ఆనందంగా గడుపుతూ ఎవరిని వేధింపులకు గురి చేయాలో యాక్షన్ ప్లాన్ తయారు చేయడం తప్ప అభివృద్ధి శూన్యం: ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు కోర్టు శిక్ష విధించడానికి బాధ్యత వహిస్తూ రాజ్యాంగం మీద ఏ మాత్రం గౌరవం ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలి
.