తొందరపాటు వద్దు.. ఆన్‌లైన్ షాపింగ్‌లో డబ్బు ఆదా చేయండిలా..!

ప్రస్తుత ఆధునిక యుగంలో షాపింగ్ అంతా ఎక్కువగా ఆన్‌లైన్‌ లోనే జరుగుతోంది.

ఆన్‌లైన్‌ లో లభించే ఎన్నో వస్తువులను పరిశీలించి, వాటి ధరలను బేరీజు వేసుకుని కొనుగోలు చేయొచ్చు.

ఏ చిన్న వస్తువు కొనాలన్నా ఆన్‌లైన్ షాపింగ్‌ పైనే ఆధారపడుతున్నారు.అయితే ఇలా కొనుగోలు చేసే సమయంలో డబ్బులు ఆదా చేసుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి.

కొన్ని సూచనలు పాటిస్తే మీ డబ్బు ఎంతో ఆదా అవుతుంది.అవేంటో తెలుసుకుందాం.

మార్కెట్‌లోకి ఏదైనా కొత్త ప్రొడక్ట్ వచ్చిందంటే అప్పుడు దాని ధర అధికంగా ఉంటుంది.అయితే కొంత కాలం వెయిట్ చేయాలి.

Advertisement

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటివి భారీ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి.ప్రతి నెలలోనూ కొన్ని రోజుల పాటు కళ్లు చెదిరే డిస్కౌంట్లను ప్రకటిస్తుంటాయి.

ఆయా రోజుల్లో మనకు ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా చాలా వరకు డబ్బును ఆదా చేయొచ్చు.ఏదైనా వస్తువు నచ్చిందంటే వెంటనే ఆర్డర్ చేయకుండా విష్ లిస్ట్‌లో పెట్టుకోవాలి.

ఇది చాలా మంచి పద్ధతి.ఎప్పుడైతే ఆ వస్తువుపై ఆఫర్ వస్తుందో దానిని వెంటనే కొనుగోలు చేయొచ్చు.

లేనిపక్షంలో దాని కంటే మంచి వస్తువును కొనుక్కోవచ్చు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలనుకుంటున్నప్పుడు దానిని గూగుల్ చేయడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది.మిగిలిన సైట్లలో ఆ వస్తువు అంతకంటే తక్కువ ధరకు లభించవచ్చు.రకరకాల ఈ-కామర్స్ సైట్లు కస్టమర్లను ఆకర్షించేందుకు ధర తగ్గిస్తుంటాయి.

Advertisement

వివిధ వెబ్‌సైట్‌ లలో క్రెడిట్, డెబిట్ కార్డులపై చాలా ఆఫర్లు ఉంటాయి.వాటిని కూడా చెక్ చేయాలి.

బెస్ట్ ఆఫర్ ఉంటే వెంటనే కొనేయొచ్చు.ఈ రోజుల్లో కూపన్ కోడ్లు ఆన్‌లైన్‌ లో కూడా అందుబాటులో ఉంటున్నాయి.

వాటి ద్వారా కూడా డబ్బు ఆదా అవుతుంది.

తాజా వార్తలు