నన్ను గెలిపించండి...ప్లీజ్....చైనా తో చాటుమాటు వ్యవహారం..??

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా ని కరోనా బూచి అంటూ ఎగతాళి చేసిన మాటలు అందరికి తెలిసినవే.

ప్రపంచం ముందు చైనాని దోషిగా నిలబెట్టి కడిగేశాడు ట్రంప్.

దాంతో చైనా అమెరికా మధ్య వాణిజ్య సంభంధాలు వగైరా వగైరా పై నీలి నీడలు అలుముకున్నాయి.ఇక చైనాపై అమెరికా ఆర్ధిక యుద్ధం చేయడానికి సిద్దమయ్యిందని చైనాని తొక్కి పెట్టి తోలు వలవడానికి ట్రంప్ సిద్దమయ్యిపోయారని అందరూ ఫిక్స్ అయిపోయారు.

కానీ ఊహించని విధంగా.అమెరికా మాజీ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాటు మాటు వ్యవహారాలు నడుపుతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమెరికాలో నవంబర్ లో వచ్చే ఎన్నికల్లో తనని గెలిపించాలని అందుకు మీ సాయం కావాలని ట్రంప్ జిన్ పింగ్ ని కోరినట్టుగా ఆయన ది రూమ్ వేర్ ఇట్ హ్యపెండ్ అనే పుస్తకంలో రాశారు.అమెరికా అధ్యక్షుడిగా తాను గెలిచే అవకాశాలు ట్రంప్ కి లేవు కాబట్టి ఈ పరిస్థితులని గమనించిన ట్రంప్ 2019 లో జరిగిన వాణిజ్య ఒప్పంద సమయంలోనే జిన్ పింగ్ ముందు తన విజ్ఞప్తిని ఉంచాడని ఆయన రాసుకొచ్చారు.

Advertisement

అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరించిన జాన్ బోల్టన్ ఈ సంచలన విషయం తన పుస్తకంలో రాసుకు రావడం ఇప్పుడు అమెరికా వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.అయితే ఈ విషయంపై స్పందించిన డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి బిడెన్ ఇదే గనుకా నిజైతే ట్రంప్ చరిత్ర హీనుడు అవుతాడు అంటూ కామెంట్స్ చేశారు.

మా అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం.. కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో తీర్మానం
Advertisement

తాజా వార్తలు