ట్రంప్ కి షాక్..మళ్ళీ వైట్ హౌస్ లోకి...

అమెరికాలో ట్రంప్ పైత్యాని సరైన కౌంటర్ వేశాడు ఆ జర్నలిస్ట్.తిక్క పనులు చేస్తూ అధికారాన్ని అడ్డంగా దుర్వినియోగం చేస్తున్న ట్రంప్ పిచ్చ వైఖరికి.

అక్కడి కోర్టు చీవాట్లు పెట్టింది.వివరాలలోకి వెళ్తే.

గత వారం వైట్ హౌస్ లో మధ్యంతర ఎన్నికల అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో సీఎన్ఎన్ విలేఖరిపై ట్రంప్ విరుచుకుపడిన విషయం విధితమే అయితే.ఈ విషయంలో ట్రంప్ ఆ విలేఖరిని వైట్ హౌస్ నుంచీ బహిష్కరించాడు దాంతో

ఏ మాత్రం బెరుకులేకుండా ఆ జర్నలిస్ట్ జిమ్ అకోస్టా , అదేవిధంగా సీఎన్ఎన్ న్యూస్ చానల్ కోర్టులో చేయండి సవాల్ చేశారు.కేసును పూర్తిగా పరిశీలించిన ఫెడరల్ జడ్జి టిమోతి జె.కెల్లీ.అకోస్టా పాస్ ను రిటర్న్ చేయాలని ఆదేశించింది.

Advertisement

ట్రంప్ వైట్ హౌస్ జర్నలిస్టులకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నారన్న కోర్టు.హుందాతనం పాటించాలని ట్రంప్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.

ఇది కేసుకు సంబంధించి తుది తీర్పు కాదని, అకోస్టా బహిష్కరణ నిబంధనల మేరకే జరిగిందా లేదా అనేది చూడాల్సి ఉందని జడ్జి వ్యాఖ్యానించారు.బహిష్కరించాల్సి వస్తే ఆ నిబంధనల మేరకే జరగాలన్నారు.దీంతో అకోస్టా మళ్లీ విధుల్లోకి చేరారు.

మరి ట్రంప్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

నిజ్జర్ హత్య కేసు : ఆ నలుగురు భారతీయులు కస్టడీలోనే, మళ్లీ నోరు పారేసుకున్న కెనడా
Advertisement

తాజా వార్తలు