జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు చూస్తే కోటలు దాటుతాయి.ఉప్పొంగిన ఆవేశంతో ఎగిసి పడే కెరటం లా పవన్ చెప్పే డైలాగులు ఊహించుకునే కార్యకర్తలకు, అభిమానులకు పవన్ రాజకీయాలను శాసించేస్తాడా అనే ఆలోచనల్ని ,సంతోషాన్ని కలగజేస్తాయి… కానీ చిట్టచివరికి పవన్ మాటలు నీటి మూటలని తేలడంతో అభిమానులు ఊహించుకునే సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడం జరుగుతుంది.
ఇప్పుడు ఇదే పరిస్థితి అభిమానులకు ఎదురయ్యింది.
అభిమానులు ,జనసైనికుల ఊహలకు వారి ఆలోచనలకు పవన్ గండి కొట్టడం తో ప్రేక్షక పాత్ర పోషించవలసిన పరిస్థితి జన సైనికులకు ఏర్పడింది…వివరాలలోకి వెళ్తే…తెలంగాణలో తమ రాజకీయ భవిష్యత్తుపై గంపెడాశలు పెట్టుకున్న జనసైనికులు జనసేన నేతలు పవన్ తీసుకున్న నిర్ణయంతో నడి మధ్యలో నావలాగా అలాగా ఇరుక్కుపోయారు నమ్ముకున్న జనసేనాని నట్టేట ముంచాడు అంటూ లబోదిబోమంటున్నారు తెలంగాణలో కొద్దిరోజుల్లో ఎన్నికలు ప్రారంభం అవుతున్న సమయంలో అన్ని పార్టీల నాయకులు నేతలు కార్యకర్తలు సందడి చేస్తుంటే జనసైనికులు మాత్రం నోరెళ్ళ పెట్టుకుని చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందట.
గతంలో పవర్ ఫుల్ డైలాగ్ , ఊక దంపుడు ప్రసంగాలతో రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్, తెలంగాణలో పోటీ లేదని ప్లేటు ఫిరాయించడం తో లోలోపల మండిపడుతున్నారట జనసైనికులు.రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల కష్టాలు తీర్చడమే తన ధ్యేయంగా పెట్టుకున్నానని , ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా నేనున్నానంటూ దుమ్ము రేపే సినిమా డైలాగులు చెప్పిన పవన్ కళ్యాణ్ తన పార్టీ నేతలను సైనికులను మాత్రం కష్టాల్లో నెట్టేశారు అంటున్నారు పరిలీలకులు.
అంతేకాదు జనసేన పార్టీ అండగా ఉంటుంది అన్న నమ్మకంతో గతంలో టిఆర్ఎస్ లో, కాంగ్రెస్, సిపిఐ సిపిఎం పార్టీలో చాలా కీలకంగా ఉన్న నేతలు, కార్యకర్తలు బయటకు వచ్చేశారు…అయితే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో పవన్ యూటర్న్ తీసుకోవడం తో తన భవిష్యత్తు ప్రశ్నార్ధకం అయ్యిందని వాపోతున్నారట.పవన్ జర తెలంగాణా సైనికులపై ఓ లుక్కేయరాదే అంటున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు