అగ్రరాజ్యం అమెరికాలో డాలర్ పతనమా?

ప్రపంచాన్ని శాసించే ఆర్ధిక డాలర్ ఇపుడు ఆర్ధిక మాంధ్యాన్ని ఎదుర్కొంటుందా? తాజా విశ్లేషణలను బట్టి ఎవరూ నమ్మలేని నిజాలు కొన్ని ఎస్ డాలర్ ఫేస్ చేస్తుందంటున్నారు ఆర్ధిక వేత్తలు.అగ్రరాజ్యం అమెరికాలో డాలర్ పతనమా? ఇది ఎంతమాత్రం నమ్మ సఖ్యం కావడంలేదు.కాని ఇది నిజంగానే వాస్తవం.అధ్యక్షుడు జోబైడన్ పదవిలోకి వచ్చిన తర్వాత అమెరికన్ ఆర్ధిక పరిస్థితి గ్రాఫికల్ గా దిగువకు దిగజారుతుంది.తాజాగా ఆర్ధిక నిపుణుల అంచనాల ప్రకారం అగ్ర రాజ్యం అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతోందంటున్నారు.దీంతో అమెరికన్ సిటిజన్స్ లో ఆర్థిక మాంద్యం భయాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

 Dollar Collapse In America America, Dollar , Collapse, Economic Recession, Joe-TeluguStop.com

ప్రజల్లో పెల్లుభుకుతున్న ఆందోళనలపై అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా తాజాగా స్పందించారు.

ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన సమర్ధించారు.

అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుందని తాను అనుకోవడం లేదని తేల్చి చెప్పారు.కాకపోతే వేగవంతమైన వృద్ధి కాస్త మందగించిదని ఆయన అంగీకరించారు.

ప్రస్తుతం స్థిరమైన వృద్ధి దిశగా వెళ్తున్నామన్నారు.ఉద్యోగాలు కూడా పెరుగడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మరోవైపు అమెరికన్ ఉన్నతాధికారులు కూడా ఆర్ధిక మాంద్యం భయాందోళనలను ఖండించారు.కార్మిక రంగం పటిష్ఠంగా ఉన్నందున ఆర్థిక వ్యవస్థ తిరోగమనం ఉండబోదని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.తాజా అధ్యయనాల ప్రకారం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అమెరికా వృద్ధి రేటు ఊహించిన దానికంటే 1.6శాతం తగ్గిపోయింది.మరోమారు వరుసగా రెండో త్రైమాసికంలోనూ జీడీపీ తగ్గే అవకాశాలున్నట్లు ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.మరోవైపు జూన్‌ నెలలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల సరికొత్త గరిష్ఠానికి చేరింది.

దీంతో ఫెడరల్ రిజర్వ్‌ మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.

Telugu Collapse, Dollar, Donald Trump, Economic, Interest Rates, Joe Biden-Telug

ద్రవ్యోల్బణం తగ్గించడానికి వడ్డీ రేట్ల పెంపు అత్యవసరమని ఇప్పటికే ఫెడ్‌ ఛైర్మన్‌ వెల్లడించారు.అయితే, ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా ద్రవ్యోల్బణాన్ని తగ్గించడమే తమ లక్ష్యమని ప్రకటించారు.ద్రవ్యోల్బణం పెరగడం, ఆర్ధిక మాంద్యం ఏర్పడుతుందేమో అనే భయం పస్తుతం అమెరికన్స్ లో కనిపిస్తుంది.

మరోవైపు అమెరికాలో బైడెన్‌ క్రెడిబులిటీ క్రమీపీ తగ్గుతుందనేది విశ్లేషకుల అంచనా.ఆయనపై ప్రజలకు మొదట ఉన్న అభిమానం, తదితర అంశాల్లో కొంత వ్యకతిరేకత చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది.

ట్రంప్‌ హయాంలో ఇక్కడ సిటజన్స్ అనుభవించిన కొన్ని చేదు నిజాలనుంచి బయట పడటానికి జోబైడన్ ను ఎన్నుకుంటే, ఆనేమో ప్రజా అమోద యోగ్యంకాని నిర్ణయాలతో, డిక్టేటర్ గా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు చాలామందిలో వ్యక్తమవుతున్నాయి.ఈ మేరుకు తాజా పరిస్థితులను అధ్యయనం చేస్తే జోబైడన్ భవితవ్యం ఇక ముందు మరిన్ని సవాళ్లు ఎదర్కోవలసి వస్తుందనే అభిప్రాయాలు విశ్లేకుల్లో వ్యక్త మవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube