'మునుగోడు ' పై రేవంత్ అదిరిపోయే స్కెచ్ ! భారీగానే ప్లాన్ ?

మొత్తానికి మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి లోకి వెళ్లాలని నిర్ణయించుకోవడంతో పాటు, దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి  చేశారు.ఇప్పటికైనా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో సమావేశమై పార్టీలో చేరిక విషయమే చర్చించారు.

 Tpcc Revanth Reddy Strategies On Munugodu By Elections After Resignation Of Koma-TeluguStop.com

ఇప్పటికే కాంగ్రెస్ సైతం రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరుతారనే అభిప్రాయానికి వచ్చేసింది.దీంతో ఈ నియోజకవర్గంలో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే విషయం పైన అప్పుడే కసరత్తు మొదలుపెట్టింది.

కాంగ్రెస్ పార్టీకి , ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని డిసైడ్ అయిపోయారు.ఈ మేరకు కసరత్తు చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే రాజగోపాల్ రెడ్డి పై బహిష్కరణ వేటు వేసే దిశగా కాంగ్రెస్ సిద్ధమవుతోంది.కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ అధికారులు విచారిస్తున్న సందర్భాన్ని ప్రస్తావిస్తూ,  చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ రాజగోపాల్ రెడ్డి మాట్లాడడాన్ని కాంగ్రెస్ అధిష్టానం సైతం సీరియస్ గానే తీసుకుంది.

సోనియాను ఈడి అధికారులు విచారించడంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేస్తున్న వేళ , రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యానించడాన్ని కాంగ్రెస్ పెద్దలు తప్పుపడుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి తదితరులతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు.

రాజగోపాల్ రెడ్డి పై తక్షణమే బహిష్కరణ వేటు వేయాలని పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సంకేతాలను కేడర్ కు పంపించాలని నిర్ణయించారు.ఇక మునుగోడు లో పార్టీ కేడర్ రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్లకుండా రాబోయే ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 50వేల మందితో భారీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఢిల్లీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Telugu Aicc, Congress, Komatirajagopal, Pcc, Revanth Reddy, Sonia Gandhi, Telang

ఇప్పటికే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరబోతున్నారంటూ క్లారిటీ ఇవ్వడంతో కాంగ్రెస్ అలార్ట్ అవుతోంది.ఇక రాజగోపాల్ రెడ్డి సైతం తనపై సస్పెన్షన్ వేటు వేసే వరకు వేచి చూడాలా లేక ముందుగానే స్పీకర్ ను కలిసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలా అనే విషయంలో బిజెపి పెద్దలతో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.ఇక టిఆర్ఎస్ సైతం రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే వెంటనే ఆయన రాజీనామాను ఆమోదించి, ఎన్నికలకు వెళ్లి తమ సత్తా చాటుకోవాలని చూస్తోంది.అలాగే అవసరం అయితే భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దింపితే ఫలితం ఎలా ఉంటుంది అనే దానిపైనా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube