అప్పుడప్పుడు మనం వింటూవుంటాం.ఏదైనా తవ్వకాలు జరిపినపుడు పురాతన వస్తువులు అక్కడక్కడా బయటపడుతూ ఉంటాయి.
లంకె బెందెలు బయటపడ్డయనో, దానిలో నగలు, బంగారు కాయిన్స్, నగలు ఉన్నాయనో వింటూ ఉంటాం.ఇది సాధారణమైన విషయం.
అయితే తాజాగా ఒక గుడిలో వున్న హుండీ ఓపెన్ చేసి చూడగా 1818 నాటి పురాతన నాణేలను చూసి ఆలయ సిబ్బంది అవాక్కయ్యారు.వివరాల్లోకి వెళితే.
దక్షిణ కాశీ గా పేరుపొందిన సిద్ది రామేశ్వర ఆలయ హుండీ లెక్కింపుని బుధవారం నిర్వహించారు.అందులో పురాతన నాణేలు వచ్చాయి.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో సిద్ది రామేశ్వర ఆలయంలో చోటుచేసుకున్న ఘటన తాజాగా వెలుగు చూసింది.హుండీలలో భక్తులు కానుకలు సమర్పించారు.వాటిని భక్తుల సమక్షంలో లెక్కించారు ఆలయ సిబ్బంది.ఈ లెక్కింపుల్లో 1818 సంవత్సరంలో ముద్రించిన నాణాలు వచ్చాయి.
అవి సీతారాములు.కమలం పువ్వు బొమ్మలతో ఉండటం గామానార్హం.
కాగా ఈ న్యూస్ ఆనోటా ఈనోటా తెలిసి దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విషయం తెలిసినవారు.“త్రవ్వకాలలో బయటపడినట్టు హుండీలలో ఓల్డ్ కాయిన్స్ బయటపడడమేంటబ్బా!” అని ఆశ్చర్యం విల్లటం చేస్తున్నారు.కాగా గతంలో పలు చోట్ల తవ్వకాలలో ఇలాంటి నాణేలు వెలికి చూడటం మనకు తెలిసినదే.
కొన్నాళ్ల క్రితం మధ్యప్రదేశ్ తికమ్‌గర్హ్ జిల్లాలోని ఓ ఇసుక క్వారీలో 164 పురాతన నాణేలు దొరకడం తెలిసినదే.ఈ నాణేలు మొఘలుల కాలం నాటివి అప్పట్లో అధికారులు పేర్కొన్నారు.
ఇసుక క్వారీలో పనులు చేస్తుండగా ఓ కుండ బయటపడంతో నాణేలు లభించినట్లు అధికారులు తెలిపారు.అలాగే చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి మండలం ఈశ్వరయ్య కాలనీలో రాజు బొమ్మలతో ఉన్న పురాతన కాలం నాటి నాణేలు సుమారు 900పైగా బయటపడటం తెలిసినదే.







