బైకు నడిపిన కుక్క.. ఔరా అంటోన్న జనం

కుక్క బైకు నడిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఎలాంటి భయం లేకుండా ఓ కుక్క ఇద్దరు వ్యక్తులను వెనకాల ఎక్కించుకుని మరీ బైకును తోలిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఆ దారిగుండా కారులో వెళ్తున్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది బాగా వైరల్ అయ్యింది.

కుక్క బైకు నడపడంతో ఆ కుక్కను పొగడ్తలతో ముంచెత్తారు నెటిజన్లు.అయితే కొందరు కుక్కను పొగిడేస్తుంటే, మరికొంతమంది ఆ వెనకాల కూర్చున్న వ్యక్తులపై సెటైర్ వేస్తున్నారు.

కుక్క బండినడపడం సరే, తేడా వస్తే మీపని అంతే అంటూ కామెంట్లు విసురుతున్నారు.నిజానికి కుక్క బైకు తోలలేదని, అది తోలినట్లు కూర్చుందని, దాని వెనకాల కూర్చున్న వ్యక్తుల్లో ముందున్నవ్యక్తి బైకు నడిపి సాఫీగా వెళ్తున్న సమయంలో హ్యాండిల్ వదిలేశాడంటూ మరికొంతమంది అంటోన్నారు.

Advertisement

ఏదేమైనా కుక్క బైకు తోలినట్లు కనపించే ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..
Advertisement

తాజా వార్తలు