పిల్లాడిని కరిచిన కుక్క.. చూస్తూ పట్టించుకోని యజమాని

కొందరిలో ఏమాత్రం మానవత్వం ఉండదు.మచ్చుకైనా కరుణ చూపించరు.నోరు తెరిచి అయ్యో పాపం అన్న పాపాన పోరు.వారిలోని గుండె రాయి కంటే గట్టిగా ఉంటుంది.చిన్నా, పెద్దా అనే తేడా ఏమీ ఉండదు.ఎదుటి వారు బాధపడుతున్నా.

 Dog Bites Kid In Lift Of Charms Castle Society In Ghaziabad Details, Dog Byte Bo-TeluguStop.com

వారి కఠినమైన గుండె చలించదు.అలాంటి హృదయం లేని ఓ మహిళ గురించే ఇదంతా.

తనో కుక్కను పెంచుకుంటుంది.ఓ అపార్ట్ మెంట్ లో ఉంటోంది.

లిఫ్ట్ లో వెళ్తున్నప్పుడు ఆ లిఫ్ట్ లోనే ఓ పిల్లాడు ఉన్నాడు.తను పెంచుకుంటున్న కుక్క ఆ బాలుడిని తీవ్రంగా కరిచినా.

తను ఏమాత్రం ఆపలేదు.ఆ కుక్క కరుస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయింది.

ఆ బాలుడు నొప్పితో విలవిల్లాడుతుంటే ఏమాత్రం చలించలేదు.

అది ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ లోని ఓ హౌజింగ్ సొసైటీ.

అదే హౌజింగ్ సొసైటీలో నివసిస్తున్న ఓ బాలుడు సోమవారం సాయంత్రం పాఠశాల నుండి తిరిగి ఇంటికి వస్తున్నాడు.పైకి వెళ్లేందుకు లిప్ఠ్ లోకి ఎక్కాడు.ఆ తర్వాత అదే లిఫ్ట్ లోకి ఓ మహిళ తన పెంపుడు కుక్కతో పాటు ఎక్కింది.కుక్కకు భయపడుతూ దూరంగా ఉండేందుకు ప్రయత్నించాడు.

అయితే.కాసేపటికి ఆ కుక్క ఆ బాలుడిని చూసి దగ్గరకు వచ్చి కాలిని కరిచింది.

ఆ బాలుడు నొప్పితో విలవిల్లాడాడు.కాలు పట్టుకుని కన్నీరు పెట్టుకున్నాడు.

కానీ ఆ కుక్క యజమాని అయిన మహిళ మాత్రం అదంతా చూస్తూ ఉండిపోయింది.అదంతా లిఫ్ట్ లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube