ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులకు నిరసనగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రేపు వైజాగ్‌లో లాంగ్ మార్చ్‌ను నిర్వహించబోతున్న విషయం తెల్సిందే.రాష్ట్ర నలువైపుల నుండి పెద్ద ఎత్తున జనసేన కార్మికులు మరియు భవన నిర్మాణ కార్మికులు ఈ లాంగ్ మార్చ్‌లో హాజరు కాబోతున్నారు.
లాంగ్ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా లేదా అంటూ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్‌కు పోలీసులు అనుమతించారని, రాత్రి అయ్యేలోపు మార్చ్‌ను ముగించాల్సిందిగా పోలీసులు ఆదేశించారట.
లాంగ్ మార్చ్ సందర్బంగా అసాంఘీక కార్యక్రమాలు జరిగినా విద్వంసంకు పాల్పడినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.వైజాగ్ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేలా లాంగ్ మార్చ్ జరగాలంటూ ఈ సందర్బంగా పోలీసులు జనసేన పార్టీ కార్యకర్తలకు సూచించారు.
పోలీసుల బందోబస్తు కూడా భారీగా ఉండబోతుంది.స్పెషల్ ఫోర్స్ తో పాటు పలు బెటాలియన్స్ కూడా వైజాగ్ లాంగ్ మార్చ్ నేపథ్యంలో భద్రత కల్పించబోతున్నాయి.