ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతూ ఉంటాయి.అందుకే చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు అటు ఓ కన్నేసి ఉంచాలి.
లేదంటే పెను ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.వారికి ఆ వయస్సులో ఏది ఏమిటో తెలియదు కనుక మన జాగ్రత్తలో మనం ఉండకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయి.
ముఖ్యంగా పసి పిల్లలు తమ చేతికి ఎలాంటి వస్తువు దొరికినా దాన్ని నోటిలో పెట్టుకోవడానికే ప్రయత్నిస్తారు.ఒకొక్కసారి అలా నోట్లో పెట్టుకున్న వస్తువులు పొరపాటున నేరుగా పిల్లల కడుపులోకి వెళ్లి లేనిపోని ఇబ్బందులకు కారణభూతలవుతాయి.
ఇక్కడ కూడా అలాంటి సంఘటనే జరిగింది.ఈ ఘటన టర్కీలో జరిగినట్టు తెలుస్తోంది.అక్కడ కొంతమంది వైద్యులు 15 ఏళ్ల బాలుడి కడుపు నుండి 3 అడుగుల పొడవైన ఛార్జింగ్ కేబుల్‌ను ఎంతో శ్రమకోర్చి తీశారు.టర్కీ పోస్ట్‌ల నివేదిక ప్రకారం.
వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పితో ఓ బాలుడు సదరు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు.తమ కొడుకు ఎందుకు కడుపు నొప్పితో బాధపడుతున్నాడు అనేది కుటుంబ సభ్యులకు మొదట అర్థం కాలేదు.
దీంతో బాలుడికి పరీక్ష చేసిన వైద్యులు ఎక్స్‌రే తీయాలని సూచించారు.తీరా ఎక్స్‌రే తీయడంతో విషయం బయటపడింది.

అతని కడుపులో ఛార్జింగ్ కేబుల్ ఉన్నట్లు వైద్యులు కనుగొన్నారు.వెంటనే డాక్టర్లు పొత్తికడుపుకు శస్త్ర చికిత్స చేసి.కడుపులోంచి కేబుల్‌ను విజయవంతంగా తొలగించారు.అలాగే ఛార్జింగ్ కేబుల్‌తో పాటు కడుపు నుండి హెయిర్‌పిన్‌ను కూడా తొలగించారు.ఇక ఛార్జింగ్ కేబుల్ లాంటి పెద్ద వస్తువు బాలుడి కడుపులోకి ఎలా వెళ్లిందో తెలియదని అతని కుటుంబసభ్యులు చెప్పారు.దాంతో డాక్టర్లు వారికి క్లాస్ తీసుకున్నారు.
పిల్లలు ఆడుకునేటప్పుడు ఇలాంటి వస్తువులు ఏమి వారికి సమీపంలో వుంచకూడదని, ఒకవేళ ఉన్నప్పటికీ వారిపై ఓ కన్నేసి ఉంచాలని సూచించారు.







