ప్రపంచ సోషల్ మెసేజింగ్ దిగ్గజం అయినటువంటి వాట్సాప్ తన యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్తకొత్త అప్డేట్లతో దూసుకుపోతోంది.ఈ క్రమంలో మరింతమంది వినియోగదారులకు చేరువవుతోంది.
తాజాగా కాల్స్‌కు నోటిఫికేషన్స్‌ను డిజేబుల్ చేయడం, కాల్ నోటిఫికేషన్లను మ్యూట్ చేయడం వంటివి వినియోగదారులను అనుమతించనుంది.దీని ద్వారా ఎప్పుడైనా మీరు బిజీగా ఉన్నప్పుడు కాల్ నోటిఫికేషన్స్‌తో డిస్టర్బ్ కాకుండా ఉండేందుకు వీలుంది.WaBetaInfo కథనం ప్రకారం విండోస్ 2.2250.4.0 అప్‌డేట్‌లో ఈ ఫీచర్ మొదటిసారి కనిపించింది.
ఇది కావాలంటే మీరు ఇలా చేయాల్సి ఉంటుంది.మొదటగా మీరు వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి.అక్కడ డిజేబల్ నోటిఫికేసన్స్ ఫీచర్ మీకు అందుబాటులో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి.ఒక వేళ ఉంటే ఆ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలి.
ప్రస్తుతానికి బీటా యూజర్లకు అప్‌డేట్ ఇచ్చారు కాబట్టి త్వరలో మిగతా యూజర్లకు కూడా అందుబాటులోకి రానుందని సమాచారం.అలాగే వాట్సాప్ ఇటీవలే వినియోగదారుల కోసం పర్సనలైజ్డ్ 3డీ అవతార్‌లను అందుబాటులోకి తెచ్చిందనే విషయం మీకు తెలుసా?.

ఈ అవతార్ అనేది వినియోగదారుడి డిజిటల్ వెర్షన్ గా చెప్పుకోవచ్చు.భిన్నమైన హెయిర్ స్టైల్స్, ఫేసియల్ ఫీచర్స్, డ్రెస్సింగ్ కలపడం ద్వారా మీకు నచ్చినవి సృష్టించవచ్చు.ఈ క్రమంలో వినియోగదారులు వారి పర్సనలైజ్డ్ అవతార్‌ను వారి ప్రొఫైల్ ఫోటోగా పెట్టుకొనే వీలుంది.అంతేగాక విభిన్న భావోద్వేగాలు ప్రతిబింబించే 36 స్టిక్కర్‌లలో ఒకదాని నుండి మీకు నచ్చిందని చుకోవచ్చు.
ఇది మీ నిజమైన ఫోటోను ఉపయోగించకుండా ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతోంది.తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి.







