వైరల్‌ : కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు పాపం, ఇక సిస్టర్స్‌ జుట్టు కట్‌ చేసుకుంటున్నారు ఎందుకో తెలుసా?

చైనాలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది.ఇప్పటికే దాదాపుగా రెండు వేల మంది చనిపోయినట్లుగా సమాచారం అందుతోంది.

ఇక చైనాలో కరోనా వైరస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య ఏకంగా 70 వేలకు పైగా ఉందని అంటున్నారు.కరోనా వైరస్‌ వ్యాదిగ్రస్తులకు సరైన చికిత్స అందించకుంటే వెంటనే వారు చనిపోవడంతో పాటు ఆ వైరస్‌ మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

అందుకే కరోనా వ్యాదిగ్రస్తులకు అత్యంత నాణ్యమైన చికిత్సను చైనా ప్రభుత్వం అందిస్తుంది.చైనా ప్రభుత్వం కరోనా వైరస్‌పై యుద్దం చేసేందుకు డాక్టర్లను మరియు కాంపౌండర్స్‌ను వాడేసుకుంటుంది.

గత రెండు వారాలుగా చైనాలో ప్రతి ఒక్క డాక్టర్‌ కూడా కరోనా వైరస్‌కు సంబంధించిన రోగులకే చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.ప్రతి డాక్టర్‌ కూడా రోజులో 12 నుండి 15 గంటలు పని చేస్తున్నారు.

Advertisement

అస్సు విశ్రాంతి లేకుండా డాక్టర్లు పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.డాక్టర్లు కనీసం టాయిలెట్‌కు కూడా వెళ్లకుండా అడల్డ్‌ డైపర్లు వేసుకుని మరీ పని చేస్తున్నారట.

కరోనా వైరస్‌ బాధితులతో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఏ చిన్న తప్పు జరిగినా కూడా డాక్టర్లకు మరియు ఇతర రోగులకు మరింత ప్రమాదం జరుగుతుంది.అందుకే డాక్టర్లు కంటికి రెప్ప వేయకుండా అన్నట్లుగా కష్టపడుతున్నారట.ఇక లేడీ కాంపౌండర్స్‌ కూడా తమ ప్రాణాలను సైతం పనంగా పెట్టి కరోనా వైరస్‌తో పోరాడుతున్నారట.

సిస్టర్స్‌ తమ జుట్టు వల్ల ఇబ్బంది కాకుండా కట్‌ చేయించుకున్నారు.ఇటీవల వందలాది మంది సిస్టర్స్‌ జుట్టు కట్‌ చేయించుకున్నట్లుగా చైనా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

మొత్తానికి కరోనా వల్ల ఇన్నాళ్లు పెద్దగా పని లేకుండా ఉన్న డాక్టర్లు మరియు సిస్టర్స్‌ క్షణం తీరిక లేకుండా గడపాల్సిన పరిస్థితి వచ్చింది.ఈ క్రమంలో వారికి కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతుంది.డాక్టర్లు సెలవులు పెడితే వారిని ఉద్యోగం నుండి తప్పించడమే కాకుండా జైలు శిక్ష కూడా విధించేలా చైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న కారణంగా డాక్టర్లు తప్పనిసరిగా డ్యూటీకి హాజరు అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు