ఈ లోకంలో మనిషి, దేవుణ్ని తర్వాత అంతలా నమ్మేది డాక్టర్స్‌ను మాత్రమే.ఎందుకంటే దేవుడు జన్మనిస్తే, డాక్టర్ పునర్జన్మనిస్తాడని అనుకుంటారు కాబట్టి.
అందుకే కరోనా సమయంలో సేవలందించిన డాక్టర్స్‌ను ఎందరో అభిమానించారు.కానీ ఇదే కరోనా సమయంలో ఒక డాక్టర్ చేసిన పని తెలిస్తే అతన్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది.
ఇంతకు ఆ డాక్టర్ చేసిన పని ఏంటంటే తాను పనిచేసే హాస్పిటల్ లో బెడ్లు ఖాళీ చేయటానికి కరోనా పేషెంట్ల ప్రాణాలు తీసాడట.ఇక ఈ ఘటన ఇటలీ లాంబర్డిలోని ఓ ఆస్పత్రిలో కోవిడ్ ఎమర్జెన్సీ వార్డులో జరిగిందట.
ఇక్కడ పనిచేస్తున్న కార్లొ మోస్కా అనే డాక్టర్ ఎమర్జెన్సీ వార్డు కు ఇంచార్జిగా పని చేస్తున్నాడట.అయితే ఇటలీలో కరోనా కేసులు పెరగటంతో హాస్పిటల్స్ అన్ని రోగులతో నిండి పోయాయి.

ఈ క్రమంలో ఇతనున్న హస్పిటల్లో కూడా బెడ్లు అన్నీ ఫుల్ అయిపోయాయట.దీంతో డాక్టర్ కార్లొ మోస్కా కొందరు కరోనా పేషెంట్లను చంపేయాలని నిర్ణయించుకుని ఈ విషయాన్ని నర్సులకు చాటింగ్ లో చెప్పాడట.దానికి ఆ నర్సులు ఒప్పుకోక పోవడంతో, ఇతనొక్కడే 61 ఏళ్ల నటాలే బస్సీ, 80 ఏళ్ల ఏంజెలో పలెట్టి అనే కరోనా పేషెంట్లను చంపాడట.ఇక గత మార్చిలో జరిగిన ఈ దారుణ ఘటన బయటకు రావడంతో పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారట.
కాగా ఇదే హాస్పిటల్ లో మరణించిన మరో ముగ్గురి చావుకు కూడా ఈ డాక్టరే కారణమా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారట.