ధరణి వ్యవస్థ కావాలా దళారీ వ్యవస్థ కావాలా ? తేల్చుకోమంటున్న కేసీఆర్!

ఎన్నికల దగ్గర కోస్తున్న కొద్దీ తెలంగాణ ఆపడర్మ ముఖ్యమంత్రి కెసిఆర్( Chief Minister KCR ) ప్రచారంలో అలుపెరుగకుండా దూసుకెళ్తున్నారు.సమయం తక్కువ ఉండడం తో జెడ్ స్పీడ్ తో రోజుకు మూడు నుంచి నాలుగు చోట్ల ప్రజా ఆశీర్వాద సభలలో పాల్గొంటూ బారతీయ రాష్ట్ర సమితి కి ఓటు వేయాల్సిన పరిస్థితిని ప్రజలకు వివరిస్తున్నారు.

 Do You Want A Dharani System Or A Broker System Kcr Request To People , Kcr, Dha-TeluguStop.com

ఈరోజు ధరణి ఉంది కాబట్టే టింగ్ టింగ్ అంటూ టంచన్ గా రైతుబంధు ( Rythu Bandhu )సొమ్ము ఖాతాలో పడుతుందని, అలాంటి ధరణి వ్యవస్థ కావాలా? లేక దళారీ వ్యవస్థ కావాలా ఆలోచించు కోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు .పల్లె ప్రగతి అయినా, పట్టణ ప్రగతి అయినా ,సర్వజనుల సమగ్ర అభివృద్ధి అయినా బిఆర్ఎస్( Brs ) తోనే సాధ్యమని, సంక్షేమం , అభివృద్ధి తమకు రెండు కళ్ళని, అలా కాకుండా మతం పేరుతో కులం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే జాతీయ పార్టీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్లు వేయొద్దంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

Telugu Dharani, Kcr, Rythu Bandhu-Telugu Political News

ప్రజాస్వామ్యం లో ఓటనేది వజ్రాయుధమని సరైన విధంగా ఆలోచించి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ఈరోజు తెలంగాణ దేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ వన్ గా ఉందని, ఇక్కద అమలు అవుతున్న సంక్షేమ పధకాలు దేశం మొత్తం మీదా ఎక్కడా లేవని ఇలాంటి అభివృద్ధి ఆగిపోకూడదు అంటే బారతీయ రాష్ట్ర సమితి( Bharatiya Rashtra Samithi ) కి మరోసారి పట్టం కట్టాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.ఇప్పటి వరకూ 90 శాతానికి మందికి పైగా రుణమాఫీ జరిగిందని, ఎలక్షన్ కోడ్ కారణంగా కొద్ది మందికి మాత్రం ఆగిందని, తొందరలోనే అవి కూడా కంప్లీట్ చేస్తామన్నారు। 70 ఏళ్ల మహారాష్ట్రలో లేని అభివృద్ధి 9 నెలల పసివయసులోనే తెలంగాణ సాధించిందని ,మహారాష్ట్రలో రైతులు తెలంగాణలో భూమి కొనడానికి ఇష్టపడుతున్నారని, ఎందుకంటే ఇక్కడ నీరు పుష్కలంగా ఉండి, ఉచిత విద్యుత్ సరఫరా ఉండటమే దానికి కారణమని, అలాంటి అభివృద్ధిని కొనసాగించుకోవలసిన బాధ్యత ప్రజల పైన ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు.ఎన్నికలు ఈరోజు వస్తాయి ,రేపు పోతాయని అన్ని వర్గాలను సమానంగా చూసే రాజకీయ నాయకత్వాన్ని తెచ్చుకున్నప్పుడే రాష్ట్రం ప్రశాంతగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube