ప్రస్తుతం టీమిండియా, ఆస్ట్రేలియా( IND, AUS ) జట్లు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్( ICC WTC Final match ) ఆడుతున్నాయి.WTC టోర్నమెంట్లో ఫైనల్‌కి చేరుకోవడం భారత్‌కి వరుసగా ఇది రెండోసారి.
ఇక ఆసీస్‌కి మాత్రం ఇదే తొలి ఫైనల్ అయింది.ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియానే టాస్ గెలిచింది.
కాకపోతే ఫీల్డింగ్ సెలెక్ట్ చేసుకుంది.ఆస్ట్రేలియా టీమ్ ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు చేయలేదు.
ఇండియా మాత్రం రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కన పెట్టేసింది.మొత్తంగా నలుగురు ఫాస్ట్ బౌలర్లు, రవీంద్ర జడేజాతో టీమ్ ఇండియా ఫైనల్ పోరులో అడుగుపెట్టింది.
అయితే ఈ విషయాలన్నిటికంటే ఒక విషయం ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.అదేంటంటే మ్యాచ్ మొదలు కావడానికి ముందు ఇండియన్ క్రికెట్ టీం సభ్యులు జాతీయగీతం ఆలపించారు.
ఆ సమయంలో వారు చేతులకు నల్ల బ్యాడ్జీలు( Players with black badges ) కట్టుకొని కనిపించారు.అది ఎందుకని చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు.మరి నల్ల బ్యాడ్జిలు ధరించడం వెనక గల కారణమేంటో తెలుసుకుందామా.

ఒడిశాలో అతిపెద్ద రైలు ప్రమాదం( Biggest train accident in Odisha ) జరిగిన విషయం తెలిసిందే.కోరమండల్‌తో సహా మూడు ట్రైన్లు ఒకదానికొకటి గుద్దుకోవడం వల్ల ఇప్పటివరకు 288 ప్రజల ప్రాణాలు కోల్పోయారు.చరిత్రలో ఎంతటి విషాదకరమైన రైలు ప్రమాదం ఇండియాలో జరగలేదని తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలతో సహా రకరకాల రాష్ట్రాలకు చెందిన ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషాద ఘటనలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులందరూ రోధిస్తున్నారు.
అయితే ఈ విషాద సంఘటనను గుర్తు చేస్తూ చనిపోయిన వారికి నివాళులను అర్పిస్తూ బ్లాక్ బ్యాడ్జీలను టీమిండియా క్రికెటర్లు తొడుక్కున్నారు.జాతీయ గీతం పాడేటప్పుడు బాధితులను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక నివాళులు అర్పించారు.
ఇంగ్లాండ్‌లో ఉన్నా వీరు భారత ప్రజల బాధల గురించి ఆలోచిస్తూ తమ సానుభూతిని చూపించడం పట్ల అభిమానులు గర్విస్తున్నారు.