సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా సంవత్సరాల చరిత్ర ఉందనే చెప్పాలి.ఎన్టీఆర్( NTR ) చాలా సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యంతో ఎలాడనే చెప్పాలి.
ఇలాంటి సందర్భంలో వాళ్ల ఫ్యామిలీ నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకతను అయితే ఏర్పాటు చేసుకున్నాడు.ఆయన పాన్ ఇండియా సినిమా చేస్తూ తన సత్తా ఏంటో చూపించుకుంటున్నాడు.
ఇక ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో దేవర( Devara ) అనే సినిమా చేస్తున్నాడు.

ఇక దాంతో పాటు గా పాన్ ఇండియా రేంజ్ లో మరొకసారి తన స్టామినా ఏంటో చూపించాలను కుంటున్నాడు.ఇక ఈ సినిమాలో శ్రీదేవి కూతురు అయిన జాహ్నవి కపూర్( Jahnavi Kapoor ) హీరోయిన్ గా నటించడం విశేషం… ఇక ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ హీరోగా వివి వినాయక దర్శకత్వంలో వచ్చిన అదుర్స్ సినిమా( Adhurs Movie ) సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశాడు.
దీంట్లో ఎన్టీఆర్ కి డూప్ గా ఒక డూప్ ఆర్టిస్ట్ నటించినప్పటికీ ఒక సీన్ లో ఆ ఆర్టిస్ట్ అందుబాటులో లేకపోవడంతో ఎన్టీఆర్ పర్సనల్ మేకప్ మాన్ అయిన కిరణ్( Kiran ) అనే వ్యక్తితో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారట.

ఆయన కొంచెం ఎన్టీఆర్ లుక్స్ తో ఉండడం వల్లే ఆయన చేత డూప్ గా చేయించినట్లుగా ఈ సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సినిమా యూనిట్ నుంచి అప్పట్లో బయటకు వచ్చింది.ఇక మొత్తానికైతే అనుకున్న టైమ్ కి షూటింగ్స్ ను కంప్లీట్ చేయడం లో వినాయక్ సక్సెస్ అయ్యాడు…ఇక ప్రస్తుతం వినాయక్ సినిమాలు ఏం లేక ఖాళీగానే ఉంటున్నాడు.గత సంవత్సరం బాలీవుడ్ లో ఛత్రపతి సినిమా చేసినప్పటికి అది పెద్దగా సక్సెస్ సాధించలేదు…
.