ప్రస్తుతం చాలామంది ఆన్లైన్ షాపింగ్ లాంటివి చాలావరకు క్రెడిట్ కార్డుల(Credit cards) ద్వారానే కొనుగోలు చేస్తున్నారు.అందుకే క్రెడిట్ కార్డ్ సంస్థలు తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు అద్భుతమైన ఆఫర్లను ప్రకటిస్తూనే ఉంటాయి.
క్రెడిట్ కార్డ్ ఉపయోగించే తమ వినియోగదారుల కోసం క్యాష్ బ్యాక్ ఆఫర్లు, రివార్డ్ పాయింట్లను అందిస్తున్నాయి.ఆ క్రెడిట్ కార్డులు ఏవో.ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నాయో చూద్దాం.
ఎస్బీఐ (SBI)క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్: ఈ కార్డు ద్వారా ఆన్లైన్లో కొనుగోలు చేసిన ప్రతి వస్తువుపై ఏకంగా ఐదు శాతం క్యాష్ బ్యాక్, ఆఫ్ లైన్ ట్రాన్సాక్షన్ పై ఒక శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు.ఈ ఒక్క శాతం క్యాష్ బ్యాక్ ను ఇండియన్ పెట్రోల్ బంక్ లో ఫ్యూయల్ సర్ ఛార్జ్ ని పొందవచ్చు.HDFC మిలీనియా క్రెడిట్ కార్డ్(HDFC Millennium Credit Card): అమెజాన్, బుక్ మై షో లాంటి సైట్లలో ఏకంగా ఐదు శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.ఆఫ్ లైన్ లో ఒక శాతం క్యాష్ బ్యాక్ ను క్లైమ్ చేసుకోవచ్చు.వీరికి పార్ట్నర్ గా ఉండే రెస్టారెంట్లో 20 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
ఇంకా వెయ్యి రూపాయల విలువైన గిఫ్ట్ ఓచర్స్ పొందవచ్చు.

Axis Bank ACE క్రెడిట్ కార్డు: ఈ కార్డు ద్వారా చెల్లించే బిల్ పేమెంట్ లపై ఐదు శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు.గూగుల్ పే(googlepay) నుంచి రీఛార్జ్ చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు.ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ యాప్ ల నుంచి నాలుగు శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
వీరికి పార్టనర్ గా ఉండే రెస్టారెంట్లలో 20 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.ఫ్లిప్ కార్ట్ (Flipkart)యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు: ఈ కార్డు ద్వారా ఆన్ లైన్ షాపింగ్ చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు.రూ.1100 విలువగల వెల్కమ్ బెనిఫిట్స్ పొందవచ్చు.నెలకు రూ.400 వరకు ఒక శాతం ఫ్యూయల్ సర్ ఛార్జ్ మినమహాయింపుగా పొందవచ్చు.

అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు: అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఉన్న కస్టమర్లు ఈ కార్డు ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు.ఇతర ట్రాన్సాక్షన్ లపై రెండు శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు.భారతదేశంలో ఉండే అన్ని పెట్రోల్ బంకుల్లో ఒక శాతం ఫ్యూయల్ సర్ ఛార్జ్ ని మినహాయింపుగా పొందవచ్చు.ఈ కార్డు కస్టమర్లు ఎలాంటి రెన్యువల్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు.