ఆనంద్ మహీంద్రా, బిల్ గేట్స్ ప్రస్తుతం భారత పర్యటనలో వున్న సంగతి అందరికీ తెలిసినదే.కాగా వీరి పర్యటనలో చాలా ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకుంటున్నాయి.
వ్యాపారవేత్త, మహీంద్రా చైర్మన్ అయినటువంటి ఆనంద్ మహీంద్రా పర్యటన చాలా ఆసక్తిని రేకెత్తించింది.ఆనంద్ మహీంద్రా బిల్ గేట్స్‌ను కలుసుకోవడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా హీట్ ఎక్కింది.
అతని గేట్స్ స్క్రిబ్ల్డ్ పుస్తకాన్ని ఆనంద్ మహీంద్రాకు బహుమతిగా ఇవ్వడం జరిగింది.అంతేకాకుండా ఈ పుస్తకంపై నా క్లాస్‌మేట్ ఆనంద్ అని ఆయన రాయడం కొసమెరుపు.
దాంతో ఇపుడు ఈ కోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బిల్ గేట్స్, ఆనంద్ మహీంద్రా ఇద్దరూ క్లాస్‌మేట్సా? అనే అనుమానం ఇపుడు సోషల్ మీడియాలో తలెత్తింది.కాగా దీనికి ఆనంద్ సమాధానం ఇవ్వడం కూడా జరిగింది.ఆయన ఈ విధంగా స్పందించారు… అవును నేను బిల్ గేట్స్, ఇద్దరం ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నాం అని చెప్పుకొచ్చారు.
ఇకపోతే బిల్ గేట్స్ పరీక్షలో విఫలమై తన చదువును సగంలోనే ఆపేయగా, ఆనంద్ మహీంద్రా తన విద్యను విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది.
ఆనంద్ మహీంద్రా, బిల్ గేట్స్ ఇద్దరూ హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసారు.వారి రికార్డులను పరిశీలిస్తే ఆనంద్ మహీంద్రా 1977లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు.కానీ బిల్ గేట్స్ సగంలోనే గ్రాడ్యుయేషన్ ఆపివేయడం జరిగింది.1973లో బిల్ గేట్స్ హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందినట్టు తెలుస్తోంది.2 సంవత్సరాల తరువాత, అంటే సరిగ్గా 1975 లో, బిల్ గేట్స్ తన చదువును మధ్యలోనే నిలిపివేశాడు.ఆనంద్ మహీంద్రా, బిల్ గేట్స్ ఎడ్యుకేషనల్ రికార్డుల ప్రకారం 1973 లేదా 1974లో ఒకే కళాశాల క్యాంపస్‌లో ఉన్నారు.