తెలుగు రాష్ట్రాలలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రస్థానం ఎలాంటిదో మనందరికీ తెలిసిందే.రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన వారసుడిగా జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ లో వైయస్ఆర్సిపి పార్టీని స్థాపించిన పదేళ్ల తరువాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ క్రమంలోనే రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా, తెలంగాణ ఆడబిడ్డగా, జగన్మోహన్ రెడ్డి సోదరిగా వైయస్సార్ టీపి అధినేత్రిగా రంగంలోకి దిగిన వైయస్ షర్మిలమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలంగాణలో నియంత పాలన జరుగుతోందని తెలంగాణలో ప్రతిపక్షం అనేది లేదంటూ ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలను ప్రశ్నించడానికి వైయస్ షర్మిల పార్టీని స్థాపించారు.
ఈ క్రమంలోనే తెలంగాణలో పార్టీ ఆవిర్భవించిన తర్వాత షర్మిల ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా షర్మిల ఎన్నో రాజకీయ, వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు.
అసలు తనకు రాజకీయాలంటేనే ఆసక్తి లేదని, రాజకీయాలలోకి రావాలని తనెప్పుడూ అనుకోలేదని ఈ మధ్య కాలంలో కొన్ని పరిస్థితుల కారణంగా ఆయన రాజకీయాలలోకి వచ్చానని ఈ సందర్భంగా వెల్లడించారు.నేను పార్టీ పెడతానంటే మొదటిగా కుటుంబ సభ్యులు వద్దన్నారు.
కానీ ఇక్కడ పరిస్థితులు చూసి తిరిగి రాజన్న రాజ్యం తీసుకురావాలన్న ఉద్దేశంతో పార్టీని స్థాపించానని తెలిపారు.

వ్యక్తిగత విషయానికొస్తే రాజశేఖర్ రెడ్డి గారికి షర్మిల గారికి మధ్య ఎంతో ప్రేమ ఆప్యాయతలు ఉండేవి.నిజం చెప్పాలంటే షర్మిల నాన్న కూచి అని చెప్పవచ్చు.నాన్న బతికి ఉన్నన్ని రోజులు తనపై ఈగ కూడా వాలనివ్వలేదని ఎంతో అపురూపంగా చూసుకున్నారని తెలియజేశారు.
ఇక కుటుంబంలో అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండే షర్మిలను తమ బంధువులందరూ ఎంతో ముద్దుగా షమ్మీ అని పిలుచుకుంటారనీ ఈ సందర్భంగా తెలియజేశారు.రాజశేఖర్ రెడ్డి గారు మాత్రం తనని ఎంతో ఆప్యాయంగా పాప అని పిలిచేవారని ఈ సందర్భంగా షర్మిల తెలియజేశారు.