Rajamouli Rama: ఈ టాలీవుడ్ డైరెక్టర్ల భార్యలు ఏం చేస్తారో తెలుసా?

మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు ఇలా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నటువంటి రాజమౌళి, త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, బోయపాటి వీళ్లంతా కూడా వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈ దర్శకుల భార్యలు ఏం చేస్తున్నారు వారు ఏ రంగంలో స్థిరపడ్డారు అనే విషయాన్ని వస్తే.

కృష్ణవంశీ రమ్యకృష్ణ:

ప్రముఖ డైరెక్టర్ కృష్ణ వంశీ( Krishna Vamshi ) భార్యగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి రమ్యకృష్ణ( Ramya Krishna ) ఈమె హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే కృష్ణవంశీ ప్రేమలో పడ్డారు.ఇలా వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత కూడా రమ్యకృష్ణ నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

రాజమౌళి రమ:

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రాజమౌళి( Rajamouli ) భార్య రమా( Rama ) గురించి అందరికీ తెలిసిందే.ఈమె రాజమౌళి దర్శకత్వంలో వచ్చే సినిమాలు అన్నింటికి కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

అయితే ఈమె కేవలం రాజమౌళి సినిమాలకు మాత్రమే కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్నారని చెప్పాలి.

Advertisement

త్రివిక్రమ్ సౌజన్య:

ఈమె భరతనాట్యకారిణిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.అలాగే ప్రస్తుతం సినిమాలకు నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఇలా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ ( Trivikram ) భార్య సౌజన్య( Sowjanya ) కూడా ఎంతో బిజీగా ఉన్నారు అని చెప్పాలి.

సుకుమార్ తబిత:

లెక్కలు మాస్టర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సుకుమార్ ( Sukumar ) భార్య తబిత (Thabitha) గురించి అందరికీ సుపరిచితమే ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ప్రైవేటు రంగంలో మాత్రం చాలా మంచిగా రానిస్తున్నారు.

అనిల్ రావిపూడి భార్గవి

: ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి( Anil Ravipudi ) భార్యగా భార్గవి (Bhargavi ) చాలామందికి పెద్దగా తెలియదు ఎందుకంటే ఈమె సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటారు.అయితే సినిమాలకు దూరంగా ఉన్నటువంటి భార్గవి కేవలం గృహిణి గానే స్థిరపడ్డారు.ఇక ఈమె సినిమా వేడుకలకు రావడం కూడా చాలా ఆర్థిక జరుగుతుంటుంది.

బోయపాటి శ్రీను విలేక:

బోయపాటి శ్రీను ( Boyapati Sreenu ) యాక్షన్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు .ఇక ఈయన భార్య విలేక (Vilekha) మాత్రం సినిమాలకు చాలా దూరంగా ఉన్నారు.ఈమె హౌస్ వైఫ్ గా స్థిరపడ్డారు.

సుహాసిని మణిరత్నం:

సుహాసిని (Suhasini) ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగడమే కాకుండా పెళ్లి తర్వాత కూడా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు.అలాగే మణిరత్నం (Maniratnam ) సినిమాలకు అడ్వైజర్ గా కూడా ఈమె పని చేస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

ప్రియాంక దత్ నాగ్ అశ్విన్:

ప్రముఖ నిర్మాత అశ్విని దత్ అల్లుడిగా నాగ్ అశ్విన్ ( Nag Aswin )అందరికీ ఎంతో సుపరిచితమే.ఇక ఈయన భార్య ప్రియాంక(Priyanka )కూడా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతూ పలు సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా దర్శకులు మాత్రమే కాదు వారి భార్యలు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు