మొలతాడుకు మగవారికి సంబంధం ఏంటో తెలుసా? ఆసక్తికర విషయాలివే

మొలతాడు( Molathadu ) కట్టని వాడు మగవాడే కాదు అని పెద్దలు అంటుంటారు.అయితే మొలతాడుకు, మగతనానికి మధ్య ఉండే సంబంధాలేంటి అని తెలుసుకుంటే మనకు చాలా ఆసక్తికర విషయాలు అర్థం అవుతాయి.

 Do You Know What The Mole Has To Do With Men Interesting Stuff , Do You Know ,-TeluguStop.com

ముఖ్యంగా హిందూ మతంలో మగవారంతా మొలతాడు కట్టుకుంటారు.దీనిని కట్టుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో ఎవరికీ అర్ధం కాదు.

ఇలాంటి సందేహాలు అందరికీ ఏదో ఒక సందర్భంలో వస్తాయి.అయితే ఏవి ఎలా ఉన్నా చిన్న పిల్లల విషయంలో నిక్కరు జారి పోతుందనే కారణంతో కడుతుంటారు.

ముఖ్యంగా చిన్న పిల్లలను ఉయ్యాలలో వేసే సందర్భంలో వారికి వెండి మొలతాడు ను అట్టహాసంగా కడుతుంటారు.అయితే ఆ తర్వాత నడుముకు నల్లని తాడును కడతారు.

చిన్ని కృష్ణుడికి( Lord krishna ) బంగారు మొలతాడు ఉండేదని అంతా చెబుతుంటారు.దీనిని పరిశీలిస్తే మనకు పురాతన కాలం నుంచి కూడా ఇలా నడుముకు మొలతాడు కట్టుకునే సంప్రదాయం ఉందని అర్థం అవుతోంది.

అయితే నల్లని తాడును నడుము చుట్టూ కట్టడం వల్ల దుష్ట శక్తుల ప్రభావం ఉండదని పెద్దలు చెబుతుంటారు.

Telugu Stuff, Mem, Wear, Mole-Latest News - Telugu

వేదాలలలో మనకు కొన్ని జీవన సూత్రాలు ఉన్నాయి.స్నానం చేసే సమయంలో పూర్తి నగ్నంగా ఉండకూడదని, శరీరంపై కనీసం చిన్న గుడ్డ అయినా ధరించాలని చెబుతుంటారు.ముఖ్యంగా ఆడ పిల్లలకు చిన్నప్పుడు సిగ్గుబిళ్ల కడుతుంటారు.

వారికి వివాహం జరిగిన తర్వాత మంగళసూత్రం ధరిస్తారు.అయితే అదే తరహాలో మగవారికి కూడా మొలతాడు చాలా ముఖ్యం అనే భావన ఉంది.

చనిపోయినప్పుడు మృత దేహం నుంచి మొలతాడును తీసేస్తారు.దీనిని పవిత్రంగా భావించడం వల్ల ఇలా చేస్తారు.

Telugu Stuff, Mem, Wear, Mole-Latest News - Telugu

మొలతాడు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు( Health benefits ) కూడా ఉన్నాయి.మనం తినే ఆహారం కడుపులోకి వెళ్లేటప్పుడు ఫుడ్ కంట్రోల్‌గా ఉంచడంతో సాయపడుతుంది.ఫలితంగా ఎంత బరువు పెరుగుతున్నారో తెలుస్తుంది.అంతేకాకుండా అది శరీరంలో ఎంత వేడి ఉందో గ్రహిస్తుంది.శరీరంలో అధిక వేడి ఉంటే వృషణాలలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గుతుంది.ఫలితంగా సంతానోత్పత్తి సమస్యలు ఏర్పడతాయి.

అందుకే మొలతాడు కట్టకపోతే వాడు మగవాడు కాదని అంటుంటారు.దీని వెనుక అంత పరమార్థం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube