ఒకప్పుడు వరుసగా హిట్లు ఇచ్చి ప్రస్తుతం ఒక్క హిట్ కొట్టడానికి నానా తంటాలు పడుతుంటారు మన హీరోలు నిజానికి ఇండస్ట్రీ లో హిట్స్ ఉంటేనే మనకు వాల్యూ ఉంటుంది అనేది అక్షరాల నిజం.అందుకే ప్రతి హీరో కూడా ఒక్క హిట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు.
అలా ఒక్క హిట్ కోసం ప్రయత్నం చేసే హీరో లు ఇండస్ట్రీ లో చాలా మందే ఉన్నారు.ఇక హీరో లా మాదిరి గా డైరెక్టర్లు కూడా ఒక్క హిట్ వస్తె చాలు అనుకునే డైరెక్టర్లు ఉన్నారు.
వాళ్ళెవరూ అంటే.

ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలు తీసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి( Director SV Krishna Reddy ) ఈయన ఇప్పుడు కూడా కొన్ని సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నాడు.రీసెంట్ గా రాజేంద్ర ప్రసాద్, సోహైల్ లను మెయిన్ లీడ్ గా పెట్టీ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమా తీసిన కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది.ఇక ఈ సినిమా తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్న కృష్ణారెడ్డి ప్రస్తుతం మరో కథ రెఢీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ కథతో మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించుకోవడానికి ఆయన చాలా వరకు ప్రయత్నం చేస్తున్నట్టు గా తెలుస్తుంది… అందుకే ఆయన ఒక సినిమా హిట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఒక్క హిట్ వస్తె మళ్ళీ తన మార్క్ సినిమాలు జనం ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఈయన ప్రస్తుతం ఎవరితో సినిమా చేస్తారు అనే అంశం మీద ఇప్పటికే చాలా రకాలైన చర్చలు కూడా జరుగుతున్నాయి.ఇక ఇప్పుడు ఈయన ఒక కొత్త హీరోతోనే ముందుకు వెళ్తే బాగుంటుంది అని అనుకుంటున్నట్టు గా తెలుస్తుంది…అందులో భాగంగానే ఈయన చేసే కథ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుంది అంటూ వార్తలు కూడా వస్తున్నాయి… ఒకప్పుడు ఈయన తో సినిమాలు చేయడానికి టాప్ హీరోలు కూడా పోటీ పడేవారు కానీ ఇప్పుడు ఈయనకి ఏ హీరో కూడా డేట్స్ ఇవ్వడం లేదు సినిమా ఇండస్ట్రీ అంటే ఇలానే ఉంటుంది అనేది ఈయన్ని చూస్తే అర్థం అవుతుంది.








