తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న క్రిష్( Director Krish ) ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు( Hari Hara Veeramallu ) అనే సినిమాని చేస్తున్నాడు.అయితే ఈ సినిమా ఎప్పుడో ఆగిపోయింది.
ఇక మళ్ళీ సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది అనే విషయం మీద క్లారిటీ అయితే రావడం లేదు.ఇక దాంతో ఆయన చేసేది ఏమీ లేక ఆ సినిమాని పక్కన పెట్టేసి ప్రస్తుతం అనుష్క ను( Anushka ) హీరోయిన్ పెట్టీ ఒక సినిమా చేస్తున్నాడు.
అయితే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన వేదం సినిమా మించి ఈ సినిమా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమాలో క్యారెక్టర్ల మధ్య ఉండే డ్రామాని చాలా రియలేస్టిక్ గా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే క్రిష్ ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమాని డిలే చేయడం చూసిన ఆయన ఈ సినిమాను పక్కన పెట్టేసి మరొక సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) సినిమా చేస్తున్న హరీష్ శంకర్ ప్రస్తుతం ఆ సినిమాను పక్కన పెట్టి రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చూస్తున్నాడు.
ఇక సుజీత్ కూడా పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఓజీ సినిమాను పక్కన పెట్టి నానితో మరొక సినిమా చేస్తున్నాడు.ఇలా పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన స్టార్ డైరెక్టర్లు అందరూ వేరే హీరోలతో సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు.మరి వాళ్ళు పవన్ కళ్యాణ్ తో చేసే సినిమాలు ఎప్పుడు షూట్ కంప్లీట్ చేసుకొని ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే విషయాల మీద ఇంకా సరైన క్లారిటీ అయితే రావడం లేదు.