సామాన్యులైన, సెలబ్రెటీలు అయినా పెళ్లి తర్వాత తమ భాగస్వాములను తమకు నచ్చిన పేర్లతో ముద్దుగా పిలుస్తూ ఉంటారు.పదిమందిలో ఉన్నప్పుడు ఒకలా పిలిస్తే ఏకాంతంలో ఉన్నప్పుడు ప్రేమతో ముద్దు ముద్దు పేర్లతో పిలుస్తూ ఉంటారు.
అయితే వాళ్లు పిలుచుకునే పేర్లు చాలా వరకు బయటకు తెలియదు.కానీ జూనియర్ ఎన్టీఆర్ తన భార్యను ముద్దుగా పిలుచుకునే పేరు ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.
ఇంతకీ ఎన్టీఆర్( NTR ) తన భార్యని ఏమని పిలుస్తాడో తెలుసుకుందాం.ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ( global star )గా పేరు సంపాదించుకొని ఓ రేంజ్ లో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఆర్ఆర్ఆర్ తర్వాత పంచవ్యాప్తంగా ఈయన క్రేజ్ మొత్తం పెరిగిపోయింది.ఇతర దేశస్తులను కూడా అభిమానులుగా మార్చుకున్నాడు.
సినీ ఇండస్ట్రీకి చిన్నవయసులోనే అడుగుపెట్టాడు ఎన్టీఆర్.అలా చిన్న వయసులో పలు సినిమాలలో చేయగా.

ఆ తర్వాత నిన్ను చూడాలని, స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలలో హీరోగా నటించి వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్ళాడు.ఇక ఈయనకు యమదొంగ, సింహాద్రి, ఆది, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వంటి పలు సినిమాలు మంచి గుర్తింపును అందించాయి.ఇక స్టార్ హోదాలో ఉన్న సమయంలో లక్ష్మీ ప్రణతి( Lakshmi Pranathi ) ని పెళ్లి చేసుకున్నాడు.వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఇక ఎన్టీఆర్ సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో కుటుంబ సభ్యులకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు.ముఖ్యంగా తన భార్య పిల్లలకు మాత్రం స్పెషల్ కేర్ తీసుకుంటాడు.
చాలాసార్లు తన భార్య ప్రణతి గురించి, పిల్లల గురించి అభిమానులతో పంచుకున్నాడు.అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తన ఫ్యామిలీ ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉంటాడు.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ పలు వేదికలో తన భార్యను మీడియా దృష్టిలో పడేటట్లు చేశాడు.ఆ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అవార్డు ఫంక్షన్లలో తన వెంట తీసుకువెళ్లి అందరి దృష్టిలో పడ్డాడు.విదేశాలలో కలిసి తిరిగిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకున్నాడు.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా తన భార్యతో దిగిన ఫోటోను పంచుకున్నాడు ఎన్టీఆర్.
అయితే ఈరోజు తన భార్య ప్రణతి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే అమ్మలు ( Ammalu )అని పంచుకున్నాడు.దీంతో ఆ పోస్ట్ వైరల్ అవ్వగా అది చూసి తన ఫ్యాన్స్ ప్రణతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మరి కొంతమంది ఎన్టీఆర్ తన భార్యను అలా ముద్దుగా అమ్మలు అని పిలవడంతో నువ్వు మొత్తం మారిపోయావు అన్నా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.








