టాలీవుడ్ స్టార్ హీరోలు అయినా మాస్ మహారాజ రవితేజ( Mass.Maharaja Ravi Teja ) నేచురల్ స్టార్ నాని ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇద్దరు హీరోలు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే.సినిమాలు హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.
నాని( Nani ) సంగతి పక్కన పెడితే ముఖ్యంగా మాస్ మహారాజా రవితేజ ఈ వయసులో కూడా అదే ఊపుతో ఏడాదికి రెండు మూడు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
మరోవైపు నాని కూడా ఇలాగే వరుసగా సినిమాలలో నటిస్తున్నారు.ఇది ఇలా ఉంటే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న ఈ ఇద్దరు హీరోలలో ఒక కామన్ పాయింట్ ఉందట.ఇంతకీ ఆ కామన్ పాయింట్ ఏమిటి అన్న విషయానికి వస్తే… మామూలుగా దర్శకులు హీరోలకు కథలు చెప్పినప్పుడు ఆ కథ నచ్చిందా లేదా అని చెప్పడానికి హీరోలు కొద్దిరోజులు టైం సమయం తీసుకొని ( Taking time )ఆ తర్వాత నిదానంగా చెబుతూ ఉంటారు.
కానీ ఈ విషయంలో మాత్రం నాని రవితేజ ఇద్దరు ఒకే విధంగా ఉండటంతో పాటు ఒకే విధంగా రియాక్ట్ అవుతారట.
వారిద్దరికీ డైరెక్టర్లు సినిమాల కథ చెప్పినప్పుడు నచ్చితే నచ్చిందని లేకపోతే లేదు అని వెంటనే చెప్పేస్తారట.ఇకపోతే మాస్ మహారాజా రవితేజ కెరియర్ విషయానికి వస్తే రవితేజ ఇటీవలే ఈగల్( Eagle ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక హీరో నాని విషయానికి వస్తే నాని చివరగా హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఇలా ఈ ఇద్దరు హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు.