ఒక సంవత్సరం పిల్ల‌ల డైట్‌లో ఏయే ఫుడ్స్ ఉండాలో తెలుసా?

సాధార‌ణంగా మొద‌టిసారి త‌ల్లైన చాలా మంది మ‌హిళ‌ల‌కు పిల్ల‌ల డైట్ విష‌యంలో పెద్ద‌గా అవ‌గాహ‌న ఉండ‌దు.ముఖ్యంగా సంవ‌త్స‌రం పిల్ల‌ల‌కు ఏయే ఫుడ్స్ ఫీడ్ చేయాలి.

? వాళ్ల ఆరోగ్యానికి ఏయే ఫుడ్స్ ఇస్తే మంచిది.? అన్న విష‌యాలు పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు.వాస్త‌వానికి ఎనిమిది లేదా తొమ్మ‌ిది నెల‌ల ద‌గ్గ‌ర నుంచీ పిల్ల‌ల‌కు దంతాలు రావ‌డం ప్రారంభం అవుతాయి.

అందువ‌ల్ల‌, అప్ప‌టి నుంచీ వారి డైట్‌లో కొన్ని కొన్ని ఆహారాల‌ను చేర్చితే.వారి ఎదుగుద‌ల మెరుగ్గా మారుతుంది.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ ఆహారాలు ఏంటో ఓ చూపు చూసేయండి.

బ్రోకలీ.ఆరోగ్యానికి అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందించే అద్భుత‌మైన కూర‌గాయ‌ల్లో ఇది ఒక‌టి.ముఖ్యంగా సంవ‌త్స‌రం పిల్ల‌ల‌కు ఉడికించిన బ్రోక‌లీని పెడితే.

Advertisement

వారి ఎదుగుద‌ల‌కు కావాల్సిన పోష‌కాలెన్నో అందుతాయి.అలాగే చాలా మంది సంవ‌త్స‌రం పిల్ల‌ల‌కు పాలు మాత్ర‌మే ఇస్తుంటారు.

కానీ, పెరుగు కూడా పెట్ట‌డం స్టార్ట్ చేసేయ‌వ‌చ్చు.పెరుగు పిల్ల‌ల జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను చురుగ్గా మారుస్తుంది.

సంవత్స‌రం పిల్ల‌ల డైట్‌లో ఉండాల్సిన ఆహారాల్లో ఓట్స్ కూడా ఒక‌టి.మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్‌ను చ‌క్క‌గా ఉడికించి పిల్ల‌లకు పెడితే.వారి మెదడుకు మంచి శక్తి ల‌భిస్తుంది.

మ‌రియు ఓట్స్‌లో ఉండే ప‌లు పోష‌కాలు పిల్ల‌ల ఎముక‌లు, కండ‌రాలు దృఢంగా ఎదిగేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

అవకాడో పండును కూడా సంవ‌త్స‌రం పిల్ల‌ల‌కు పెట్ట‌వ‌చ్చు.గుండె మరియు మెదడు అభివృద్ధికి అవ‌కాడో పండులో ఉండే పోష‌కాలు ఎంత‌గానో స‌హ‌క‌రిస్తాయి.పండ్ల‌లో అవ‌కాడోతో పాటు అర‌టి, బొప్పాయి వంటి పండ్ల‌ను కూడా పిల్ల‌ల‌కు పెట్ట‌వ‌చ్చు.

Advertisement

ఇక వీటితో పాటుగా ఆకుకూర‌లు, కీర దోస‌, ఉడికించిన క్యారెట్‌, బీన్స్‌, చిలగడ దుంప‌లు వంటి ఆహారాల‌ను సైతం పిల్ల‌ల డైట్‌లో చేర్చవ‌చ్చు.అయితే వీటిలో ఏది పెట్టినా.

పిల్ల‌ల‌కు తిన‌డానికి అనుగుణంగానే పెట్టండి.

తాజా వార్తలు