మనిషి చేసే ధర్మాలు,అధర్మాల గురించి మన శాస్త్రాలు కొన్ని నియమాలను సూచించాయి.ఇప్పుడు వాటిలో మనిషి చేయకూడని ధర్మాల గురించి తెలుసుకుందాం.
తలస్నానము చేసేవారికి,ఆవలిస్తున్న వారికీ,పరుగెత్తే వారికి నమస్కారం చేయకూడదు.
భార్య గర్భవతిగా ఉన్నప్పుడు సముద్ర స్నానము,నదీ స్నానము చేయకూడదు.
స్త్రీలను స్నానము చేసేటప్పుడు,కాటుక పెట్టుకొనే సమయంలో చూడరాదు.
అస్తమించే సూర్యుడు,ఉదయించే సూర్యుణ్ణి నీటిలోను, అద్దంలోను చూడకూడదు.
రాత్రి పూట చెట్ల ఆకులను కోయటం,బావిలోని నీటిని తోడటం వంటివి చేయకూడదు.
భోజనం చేసే సమయం, అవలించే, తుమ్మే భార్యను చూడకూడదు.
ఆ సమయంలో పక్కకు తిరగలి.
మొలత్రాడు లేకుండా మగవాడు ఎట్టి పరిస్థితిలోను ఉండకూడదు.
గుమ్మడికాయను స్త్రీలు పగులగొట్టకూడదు.
దీపాన్ని పురుషులు ఆర్పరాదు.
నీళ్లు త్రాగే కాంతువులు,పాలు త్రాగే దూడలను అదిలించకూడదు.