ఒక సినిమా సక్సెస్ అవ్వాలి అంటే హీరో హీరోయిన్స్ ఎంత ముఖ్యమో ఆ సినిమాకు కమెడియన్స్ ( Comedians ) కూడా అంతే ముఖ్యము.కొన్ని సినిమాలు కమెడియన్స్ కారణంగానే హిట్ అయ్యాయి అంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.
ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్స్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చెప్పాలి.ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్స్ అంటే బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, సుధాకర్ వంటి వారు గుర్తుకొచ్చేవారు.
ప్రస్తుత జనరేషన్ లో కమెడియన్ అంటే వెన్నెల కిషోర్, సత్య, రంగస్థలం మహేష్ వంటి వారు గుర్తుకు వస్తారు.

కమెడియన్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందినటువంటి సత్య( Satya ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పిల్ల జమిందార్ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సత్య పలు సినిమాలలో నటించే అవకాశాలను అందుకుని ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా నాగశౌర్య నటించిన రంగబలి ( Rangabali ) సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.
ఇలా ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సత్య ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలోని ఈయన ఇండస్ట్రీలోకి రాకముందు హైదరాబాదులో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం గడిపేవారు.అదేవిధంగా మరోవైపు అవకాశాల కోసం అన్నపూర్ణ స్టూడియో చుట్టూ చక్కర్లు కొట్టేవారట.అయితే ఈయనకు కమెడియన్ ధనరాజ్ ( Dhanaraj ) జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం కల్పించారు.
ఇలా అప్పటికే ధనరాజ్ సినిమా అవకాశాలను అందుకుంటూ జబర్దస్త్ ( Jabardasth )కార్యక్రమంలో బాగా గుర్తింపు పొందారు.దీంతో సత్యను జబర్దస్త్ కార్యక్రమంలోకి ఆహ్వానించారు.ఇలా జబర్దస్త్ లో కొంతకాలం పాటు సందడి చేసినటువంటి సత్య అనంతరం సినిమా అవకాశాలను అందుకుని ఇండస్ట్రీలో కూడా మంచిగా గుర్తింపు పొందారు.







