మెగా వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్(Ram Charan) ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా ఈయన చిరంజీవి (Chiranjeevi)తనయుడిగా చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న చరణ్ అనంతరం మగధీర సినిమా(Magadheera)తో బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో తన తండ్రి చిరంజీవి సహాయ సహకారాలు లేకుండా ఎంతో ఎత్తుకు ఎదిగారు.
ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో నటుడిగా గుర్తింపు పొందారు.

ఇలా ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ భారీగానే ఆస్తులు కూడా పెట్టారని తెలుస్తోంది.ఇలా ఈయన ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో కూడా ఎంతో సక్సెస్ సాధించాడు.అలాగే రామ్ చరణ్ దాదాపు 30 బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ మంచి ఆదాయాన్ని అందుకుంటున్నారు.
హీరోగా సక్సెస్ అయినటువంటి రామ్ చరణ్ నిర్మాతగా మారి నిర్మాతగా కూడా సక్సెస్ సాధించారు.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అయినటువంటి రామ్ చరణ్ భారీగానే ఆస్తులను కూడా పెట్టారని తెలుస్తుంది.పలు నివేదికల ప్రకారం రామ్ చరణ్ 1400 కోట్ల ఆస్తులు ఉన్నట్టు సమాచారం.ఇవే కాకుండా 40 కోట్ల విలువచేసే ఖరీదైన ఇంటితోపాటు, నాలుగు కోట్ల విలువైన లగ్జరీ కార్లు అలాగే ఒక ప్రైవేట్ జట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా భారీగానే కట్నకానుకలు తీసుకొచ్చారు.ఈమె కూడా బిజినెస్ ఉమెన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.ఇలా రామ్ చరణ్ ఆస్తుల గురించి తెలియడంతో అభిమానులు ఒకింత షాక్ అవుతున్నారు.ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా చిత్రంతో చరణ్ బిజీగా ఉన్నారు.







