తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అపజయం ఎరుగని దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రాజమౌళి తాజాగా రామ్ చరణ్ (Ramcharan) పుట్టినరోజు (Birthday) వేడుకలలో భాగంగా ఆయనకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు.
మార్చి 27వ తేదీ రామ్ చరణ్ 38వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ పుట్టిన రోజు వేడుకలలో భాగంగా పెద్ద ఎత్తున టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా హాజరయ్యారు.

ఈ క్రమంలోనే రాజమౌళి కుటుంబ సభ్యులు మొత్తం చరణ్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్నారు.అయితే రాజమౌళికి ఎక్కడికి వెళ్ళినా వారికి గిఫ్టులు ఇస్తూ సర్ప్రైజ్ చేయడం అలవాటుగా ఉంది.ఈ క్రమంలోనే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి తనకు స్పెషల్ గిఫ్ట్(Special Gift) ఇచ్చారు.ఇంతకీ ఆయన ప్రజెంట్ చేసిన ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే ప్రత్యేకంగా రోజ్ వుడ్ తో చేసిన ఓ యూనిక్ హ్యాండ్ మేడ్ లారీతో పాటు రోజ్ వుడ్ తో చేసిన మరొక ప్రతిమను కూడా కానుకగా అందించారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో రాజమౌళికి ఎంతో మంచి అనుబంధంగా ఉంది రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమా సమయం నుంచి ఈ కుటుంబంతో మంచి అనుబంధము ఉంది అయితే తాజాగా వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో మెగా ఫ్యామిలీతో మరింత అనుబంధం ఏర్పడింది.ఇక చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు(Oscar Award) రావడంతో చిత్ర బృందాన్ని మెగాస్టార్ చిరంజీవి సత్కరించి ఘనంగా పార్టీ ఇచ్చారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







