సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్(Allu Arjun) కు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.అల్లు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ తన కంటూ ఎంతో ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు.
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంగళవారంతో 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అల్లు అర్జున్ సైతం సోషల్ మీడియా వేదికగా తన 20 సంవత్సరాల సినీ కెరియర్ గురించి పోస్ట్ చేశారు.ఇకపోతే అల్లు అర్జున్ 20 సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ క్రమంలోనే చిరంజీవి ట్విట్టర్(Twitter) వేదికగా స్పందిస్తూ… డియర్ బన్నీ సినీ పరిశ్రమలో నువ్వు 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది నీ చిన్ననాటి రోజులు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి.కానీ కాలం ఎంతో తొందరగా నడుస్తుంది.ఒక నటుడిగా నీ కెరియర్ ప్రారంభించిన నువ్వు నీ కెరియర్ ను ఎంతో అద్భుతంగా మలుచుకున్నావు

నటుడిగా పాన్ ఇండియా స్టార్ గా, ఐకాన్ స్టార్ గా, నీ ఎదుగుదల చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది రానున్న రోజుల్లో నటుడుగా నువ్వు మరింత గుర్తింపు సంపాదించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా చిరంజీవి అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

ఇక చిరంజీవి చేసినటువంటి ఈ ట్వీట్ కి అల్లు అర్జున్ స్పందిస్తూ రిప్లై ఇచ్చారు.మీ అద్భుతమైన ఆశీర్వాదం శుభాకాంక్షలకు చాలా ధన్యవాదాలు.ఎప్పటికీ నేను మీ పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటాను థాంక్యూ (Thank YouChikababi) అంటూ అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు.
ఇలా ఈ ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక బన్నీ 20 సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.







