మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) ఆయన భార్య ఉపాసన( Upasana ) గురించి మనందరికీ తెలిసిందే.టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు.
ఈ జంటకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో క్రేజ్ పాపులారిటీ ఉందో మనందరికీ తెలిసిందే.ఇక గత ఏడాది ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
దీంతో మెగా ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటాయి.వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయా.
కూతురికి క్లిన్ కార( Klin Kaara ) అనే పేరు పెట్టారు.అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే రామ్ చరణ్ అటు నటుడిగా, ఉపాసన ఇటు వ్యాపారవేత్తగా ఇద్దరూ బాగానే సంపాదిస్తున్నారు.

దీంతో వీరిద్దరి ఆస్తిపాస్తులపై సంపాదనపై చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటూ ఉంటారు.కొందరు అయితే వీరి ఆస్తిపాస్తులు( Assets ) గురించి తెలుసుకోవాలని తెగ తాపత్రయపడుతూ ఉంటారు.ప్రస్తుతం వీరిద్దరి ఆస్తిపాస్తులకు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.కాగా వీరిద్దరికీ కలిపి సుమారు రూ.2,500 కోట్లకి పైగా ఆస్తి ఉంటుంది అని అంచనా.ఆర్ఆర్ఆర్( RRR ) సినిమా తరువాత రామ్ చరణ్ పేరు ఒక్కసారిగా ప్రపంచం అంతా వినపడింది.ఆస్కార్ అవార్డులు కూడా గెలుగుచుకున్న ఈ సినిమాతో రామ్ చరణ్ స్థాయి బాగా పెరిగింది అని చెప్పవచ్చు.

ఈ మొత్తం ఆస్తిలో చరణ్ ఆస్తి రూ.1370 కోట్లు కాగా, ఉపాసన ఆస్తి రూ.1130 కోట్లు అని అంచనా వేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమాకి రామ్ చరణ్ పారితోషికం రూ.45 కోట్లు తీసుకున్నారు అని, అయితే ఆ తరువాత వస్తున్న గేమ్ చెంజర్ సినిమాకి( Game Changer Movie ) పారితోషికం రూ.100 కోట్లు తీసుకున్నారని టాక్.ఒకవేళ అదే గనుక నిజమైతే చరణ్, ఉపాసన ల ఆస్తి మరో వంద కోట్లు పెరుగుతుందని చెప్పవచ్చు.ఇక ఉపాసన విషయానికి వస్తే, ఆమె దేశంలో వున్న అతి పెద్ద ఆసుపత్రుల్లో ఒకటిగా పేరొందిన అపోలో ఆసుపత్రిలో( Apollo Hospitals ) భాగస్వామి.ఆ ఆసుపత్రి విలువ మార్కెట్ లో వున్న అంచనా ప్రకరాం సుమారు రూ.77,000 కోట్లు ఉంటుందని అంటున్నారు.అలాగే వీరిద్దరూ హైదరాబాదులోని 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకొని వుంటున్నారు.ఆ ఇల్లు విలువ సుమారు రూ.30 కోట్లు ఉంటుందని అంచనా.

అవన్నీ ఒక పక్క అలా ఉంచితే, రామ్ చరణ్ కి ఒక ప్రైవేట్ జెట్( Ram Charan Private Jet ) కూడా వుంది.అతను ఎక్కడికి వెళ్లాలన్నా ఆ ప్రైవేట్ జెట్ లోనే వెళతారు అని కూడా అంటారు.అలాగే రామ్ చరణ్ తండ్రి చిరంజీవి కూడా అప్పుడప్పుడు ఆ జెట్ వాడుతూ ఉంటారని కూడా చెపుతారు.
ఒక ప్రైవేట్ జెట్ కాకుండా, రామ్ చరణ్ కి చాలా విలువైన కార్లు కూడా ఉన్నాయని, అతని కార్లు బాగా వాడతారని అంటున్నారు.అందులో రోల్స్ రోయస్ ఫాంటమ్ కారు అత్యంత విలువైనదని, ఆ కారు విలువ సుమారు రూ.9.57 కోట్లు ఉంటుందని అంటున్నారు.చెప్పుకుంటూ పోతే రామ్ చరణ్ దగ్గర విలువైన వస్తువులు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు.