లవంగాల వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..

కిచెన్లో దొరికే మసాలా దినుసులలో లవంగం ఒకటి.లవంగాన్ని ఎక్కువగా కూరల్లో, బిర్యానీలలో వాడుతారు.

లవంగం వల్ల కూరకు రుచి పెరుగుతుంది.అయితే లవంగం వల్ల రుచి పెరగడంతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

అందువలనే లవంగాలను మసాలా కర్రీలు, నాన్ వెజ్ కూరలు, బిర్యానీలలో ఉపయోగిస్తూ ఉంటారు.అయినప్పటికీ చాలామందికి లవంగం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అస్సలు తెలిసి ఉండవు.

అయితే లవంగాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.చాలామంది జలుబు, ఫ్లూ, దగ్గు, జ్వరం లాంటి వ్యాధులు వచ్చినప్పుడు నివారణ కోసం లవంగాలను తీసుకుంటూ ఉంటారు.

Advertisement

అయితే లవంగాల వల్ల మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.లవంగాలను తీసుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ ను నిరోధించవచ్చు.

అదేవిధంగా డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది.చాలామంది లవంగాలను సుగంధ ద్రవ్యాలుగా, మసాలా దినుసులుగా మాత్రమే ఉపయోగిస్తారు.

కానీ లవంగాలలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, కార్బోహైడ్రేట్లు, హైడ్రాలిక్ యాసిడ్, విటమిన్ ఏ, మ్యాంగనీస్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఈ పోషకాలు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి.అయితే భోజనం చేసిన తర్వాత తరచూ లవంగాలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.ఇలా భోజనం తిన్నాక లవంగాలను తింటే జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేసి ప్రేగులు శుభ్రపడతాయి.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

అలాగే కడుపులో ఉండే సూక్ష్మజీవులు నుండి హాని కలిగించే క్రిములు అలాగే ఇన్ఫెక్షన్ల నుండి లవంగం శరీరాన్ని కాపాడుతుంది.అలాగే లవంగాలు తినడం వల్ల వయసు పరంగా ఎముకల్లో వచ్చే అనేక రకాల సమస్యలను కూడా నివారించవచ్చు.

Advertisement

కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

అదేవిధంగా దంతాల సమస్యలు, చిగుళ్ల సమస్యలు, నోటి దుర్వాసన సమస్యలు ఉన్నవారు లవంగం వేసుకుంటే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.అదేవిధంగా కడుపులో వికారంగా ఉన్నప్పుడు లవంగాలు తీసుకోవడం వల్ల ఆ ఇబ్బంది నుంచి ఉపశమనం పొందవచ్చు.అలాగే లవంగాలు అల్సర్ ను తగ్గించడానికి కూడా సహాయపడతాయి.

అందుకే రోజుకు ఒకటి లేదా రెండు లవంగాలు తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

తాజా వార్తలు