ప్రేమించుకుందాంరా సినిమాలో జయప్రకాష్ రెడ్డి రోల్ మిస్సైన నటుడు అతనే.. ఏమైందంటే?

జయంతి సీ పరాంజి దర్శకత్వంలో వెంకటేష్( Venkatesh ) అంజలా జవేరి నటించిన సినిమా ప్రేమించుకుందాం రా.( Preminchukundam Raa Movie ) ఈ సినిమా అప్పట్లో విడుదల అయ్యి ఘన విజయం సాధించింది.

 Do You Know That A Bollywood Actor Supposed To Do In Preminchukundam Raa In Plac-TeluguStop.com

ప్రముఖ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నుండి వచ్చిన మరో సూపర్ హిట్ సినిమా ఇది.నిర్మాత డి.రామానాయుడు ఈ సినిమా సమర్పకులుగా ఉంటే, అతని కుమారుడు సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారు.ఈ సినిమాతో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు వెంకటేష్.

కాగా ప్రేమించుకుందాం రా సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం హిందీ నటుడు ఆమ్రేష్ పురి( Amrish Puri ) కావాలని దర్శకుడు అడిగారు అని తెలిసింది.

-Movie

అతను అయితే బాగుంటుంది అని దర్శకుడు చెపితే, ఆమ్రేష్ పురిని వెళ్లి అడిగితే అతను తన పారితోషికం రూ.40 లక్షలు అని చెప్పారట.ఎందుకు అతనికి అంత పారితోషికం ఇచ్చి తీసుకోవాలి అని వెంటనే నిర్మాత సురేష్ బాబు( Producer Suresh Babu ) ఆలోచించారు.

అతనికి జయప్రకాష్ రెడ్డి స్ఫురణకు వచ్చారు, వెంటనే ఆమ్రేష్ పురి కి బదులుగా జయప్రకాశ్ రెడ్డి ని( Jayaprakash Reddy ) తీసుకుందాం అని దర్శకుడికి చెప్పి అతన్ని పెట్టారు.జయప్రకాష్ రెడ్డి పారితోషికం అప్పట్లో చాలా తక్కువ, ఆమ్రేష్ పురి తీసుకున్న దానిలో పది శాతం కూడా ఉండదేమో.

అందుకని జయప్రకాష్ ని తీసుకున్నారు, అతని వలన బడ్జెట్ తగ్గింది, ఒక తెలుగు నటుడికి అవకాశం కూడా ఇచ్చినట్లయింది.

-Movie

ఆ సినిమాలో జయప్రకాశ్ రెడ్డి పాత్ర చాలా హైలైట్ అయింది.ఆ పాత్రకి అతనే సరిగ్గా సూటయ్యాడు అని ప్రేక్షకులు కూడా కితాబినిచ్చారు.తెలుగు నటుడు ఆలా ఒక రాయలసీమ యాసలో మాట్లాడటంతో ఆ పాత్రని అతను అద్భుతంగా పోషించటమే కాకుండా ఆ తరువాత జయప్రకాశ్ రెడ్డి రాయలసీమ, చిత్తూరు యాసలో ఎన్నో సినిమాలు చెయ్యడమే కాకుండా, క్యారెక్టర్ నటుల్లో ఒక ప్రధాన నటుడు అయ్యారు.

ఆ సినిమా జయప్రకాశ్ రెడ్డి కెరీర్ లో ఒక మంచి సినిమాగా నిలిచిపోయింది.ఆలా బడ్జెట్ కంట్రోల్ చేసేవారు అప్పట్లో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube