వాట్సప్ కాల్స్ ను రికార్డ్ చేయడం ఎలాగో తెలుసా..?!

ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రైవసీ విధానాన్ని వాడుతున్న వాట్సాప్ సంస్థ వినియోగదారుల వ్యక్తిగత సంభాషణలు, ఫోటోలు, వీడియోలను మూడో వ్యక్తి కంటపడకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తోంది.

ఐతే ఇప్పటివరకు వాట్సప్ అప్లికేషన్ ద్వారా చేసే కాల్స్ ని రికార్డ్ చేసే ఆప్షన్ అందుబాటులోకి రాలేదు.

నిజానికి వినియోగదారులు ఎప్పటినుంచో కాల్ రికార్డింగ్ ఆప్షన్ ని అందుబాటులోకి తేవాలని వాట్సాప్ సంస్థని కోరుతున్నారు.కానీ కాల్ రికార్డింగ్ ఆప్షన్ ని తాము ఇవ్వబోమని వాట్సాప్ సంస్థ తెలిపింది.

అయితే వాట్సాప్ లో డిఫాల్ట్ గా కాల్ రికార్డింగ్ ఆప్షన్ లేకపోయినప్పటికీ.ప్రత్యామ్నాయంగా ఇతర థర్డ్ పార్టీ అప్లికేషన్స్ డౌన్ లోడ్ చేసుకొని కాల్ రికార్డ్ చేసుకోవచ్చు.

ఇందుకోసం వినియోగదారులు ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న కాల్ రికార్డింగ్ అనే అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్లి "వాట్సాప్ రికార్డింగ్" ఆప్షన్ ని ఎనెబుల్ చేస్తే సరిపోతుంది.ఐతే ios వినియోగదారులు ప్రత్యేకంగా ఎటువంటి కాల్ రికార్డింగ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

Advertisement

మ్యాక్ బుక్ కి కనెక్ట్ చేసి, క్విక్ టైమ్ పై క్లిక్ చేస్తే కాల్ రికార్డు అయిపోతుంది.కొందరు ఆకతాయిలు వాట్సాప్ లో కాల్ రికార్డింగ్ అనే ఆప్షన్ లేదన్న ధీమాతో .అమ్మాయిలకు ఫోన్లు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.దీంతో వారి ఆగడాలను బయట పెట్టే అవకాశం ఉండటం లేదు.

కానీ ఇకపై బాధితులు ఎవరైనా చాలా సులువుగా కాల్స్ ని రికార్డ్ చేసి అన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చు.కాల్ రికార్డింగ్ కోసం సాధారణ కాల్స్ మాత్రమే కాదు ఇకపై వాట్సాప్ ద్వారా కూడా కాల్ చేసి ఆడియో రికార్డ్ చేయవచ్చు.

అయితే మన సంభాషణలను రికార్డింగ్ యాప్స్ పూర్తిగా యాక్సెస్ చేస్తాయి.దీనివల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.అందువల్ల కేవలం ప్లేస్టోర్ లో నమ్మదగిన అప్లికేషన్లను మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి.

ప్లే స్టోర్ లో కాకుండా ఇతర వెబ్ సైట్ లలో డౌన్లోడ్ చేసుకోవడం వలన వ్యక్తిగత సమాచారం అంతా ఇతరుల చేతుల్లో పడే ప్రమాదం ఉంది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు