భారత దేశంలో పురాతన వస్తువులు అప్పుడప్పుడు భయటపడటాన్ని మనం చూస్తూనే ఉన్నాం.నిజానికి పురాతన వస్తువులు అంటే మాత్రం మన దేశంలో ఎక్కువగా విగ్రహాలు బయటపడుతూ ఉంటాయి.
ఎందుకంటే మన పూర్వీకులు ఎక్కువగా విగ్రహాల ఆరాధన బాగా చేసేవారంట.అందుకే విగ్రహాలు మనకు బాగా బయట పడుతున్నట్టు కనిపిస్తాయి.
ఇక ఇప్పుడు కూడా జమ్మూకాశ్మీర్‌లో ఓ చోట చాలా పురాతనమైన దుర్గామాత విగ్రహం బయట పడటం చర్చనీయాంశంగ మారింది.కాగా ఆ విగ్రహః చాలా ఏండ్ల క్రితం నాటిదని తెలుస్తోంది.
అయితే ఇలా బయట పడ్డ విగ్రహాన్ని కాస్త పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.అయితే బయట పడ్డ ఈ విగ్రహం నల్లరాతితో స్వయంగా మనుషులే చెక్కి తయారు చేశారని అధికారులు తెలిపారు.
కశ్మీర్ లోని బుద్గామ్ జిల్లా లో ఉండే ఖాన్ సాహిబ్ ఏరియాలో ఈ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అక్కడ ఉండే అధికారు తెలిపారు.గత నెల 13న శ్రీనగర్‌లోని పంద్రెతాన్ లో ప్రవహించే జీలం నదిలో ఏవో నిర్మాణాల విషయంలో కార్మికుల తవ్వకాల్లో ఈ పురాతన విగ్రహం బయటపడింది.
కాగా ఇది దొరకిన వెంటనే ఓ వ్యక్తి విక్రయించేందుకు ట్రై చేసినా చివరకు దాని సమాచారం పోలీసులకు చేరింది.

ఇక పోలీసులు అతగాడి ఇంట్లో సోదాలు నిర్వహించిన తర్వాత ఆ పురాతన విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు.కాగా వారు స్వాధీనం చేసుకున్న ఆ విగ్రహాన్ని పురావస్తు శాఖ ఉన్నతాధికారి అయిన ముష్తాక్ అహ్మద్‌కు దాన్ని ఇచ్చారు.అయితే దాన్ని పరిశీలించిన ఆ పురావస్తు శాఖకు చెందిన అధికారులు ఆ విగ్రహం 7 లేదా 8వ శతాబ్ధానికి చెందినదిగా గుర్తించారు.
దాదాపు 1200 ఏండ్ల క్రితం ఆ విగ్రహం ఉండేదని ఇప్పుడు బయట పడిందని వారు వివరించారు.కాగా ఇప్పుడు ఈ విషయం స్థానిక మీడియాలోనూ విపరీతంగా చర్చనీయాంశంగా మారింది.