టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యి ఈయనకు ఎంతో మంచి గుర్తింపు లభించింది.
ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ హీరోకి పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం కోసం ఎన్నో కంపెనీలు ఎన్టీఆర్ చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నాయి.ఇప్పటికే పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నటువంటి ఎన్టీఆర్ తాజాగా మరొక బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఈ యాడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయినట్టు సమాచారం.ఇక ఈ యాడ్ కోసం ఎన్టీఆర్ పూర్తిగా తన గెటప్ మార్చేసినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈయన న్యూ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఎన్టీఆర్ న్యూ లుక్ చూసి ఫిదా అవుతున్నారు.ఇక ఈ లుక్ లో ఎన్టీఆర్ ని చూడగానే అందరికీ ఆయన నటించిన బాద్ షా సినిమా గుర్తుకువస్తుంది.
ఇకపోతే ఈ యాడ్ లో ఎన్టీఆర్ నటించడం కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ విధంగా సరికొత్త బ్రాండ్ ను ప్రమోట్ చేయడం కోసం ఎన్టీఆర్ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం ఎన్టీఆర్ కనిపిస్తున్నటువంటి ఈ నయా లుక్ ఖరీదు 10 కోట్ల రూపాయలను సమాచారం.ఈ విధంగా ఎన్టీఆర్ నటిస్తున్న యాడ్ కోసం ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ఇక ఈ యాడ్ చేయడం కోసం సదరు సమస్థ భారీ మొత్తంలోనే ఖర్చుపెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.అయితే త్వరలోనే ఈ యాడ్ కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.