తెలంగాణలో పండగ అంటే మామూలుగా ఉంటుందా చెప్పండి.పండగ అంటే సుక్క, ముక్క కచ్చితంగా ఉండాల్సిందే.
అది తెలంగాణ సాంప్రదాయం.అయితే ఆంధ్రాలో కూడా ఇదే సాంప్రదాయం ఉన్నా కూడా అక్కడ సుక్కకు గతిలేదు.
ఎందుకంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్య నిషేధం విధించింది.కానీ తెలంగాణలో మాత్రం సుక్కకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
ఇప్పటికే తెలంగాణ ఖజానా మొత్తం మద్యం మీదనే ఎక్కువగా ఆధారపడి నడుస్తోంది.అలాంటిది ఇక పండగల సీజన్‌లో ఎలా ఉంటుందో ఊహించండి.
పైగా అతి పెద్ద పండగు అయిన దసరాకు ఓ రేంజ్‌లోనే కిక్కు లభిస్తుంది.మామూలు సమయంలోనే మద్యం ఏరులై పారుతుంది.అలాంటిది తెలంగాణలోనే అతి పెద్ద పండుగ అయినటువంటి దసరాకు ఇంకెంతలా అమ్ముడు పోతుందో ఊహించండి.అవును ఆ అంచనాలను నిజం చేస్తూ మద్యం జోరు భారీగానే సాగింది.
పాత రికార్డుల్ని మొత్తం బద్ధలు కొట్టేసింది.ఒక్క హైదరాబాద్ నగర ప్రజలే ఇందులో ఎక్కువగా రికార్డు క్రియేట్ చేశారు.ఈ నగరంలో ఏకంగా దసరా నాడు రూ.200 కోట్ల మేర మద్యాన్ని తాగేశారంటే నమ్మండి.
మరి హైదరాబాద్‌లో జనాభా ఎక్కువ కాబట్టి ఈ రేంజ్లో అమ్ముడు పోయిది.

దీంతో పాటు అటు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీగానే మద్యం అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా రూ.685 కోట్ల వరకు లిక్కర్ సేల్ జరిగినట్టు చెబుతున్నారు అధికారులు.ఇందులో హైదరాబాద్ వాటానే అధికంగా ఉందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.ఈ రేంజ్‌లో తాగడాన్ని చూస్తే పండుగ సమయంలో ప్రజలు తాగేందుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నారా అనే అనుమానాలు కలగక మానవేమో.
మున్ముందు మరిన్ని రికార్డులు క్రియేట్ చేసేలా ఉన్నారు.కానీ ఇంతలా తాగడం అనారోగ్యానికి దారి తీస్తుందని చెబుతున్నారు డాక్టర్లు.