ఒకప్పుడు చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ మెగాస్టార్ గా ఎదిగాడు ఆయన సినిమాలు చేసే క్రమం లో చాలా రకాల సినిమాలు చేసాడు.అయితే కెరియర్ మొదట్లో ఆయన పక్కన హీరోయిన్ గా చాలామంది చేసినప్పటికీ ఆయనతో మంచి జోడీ అనిపించుకున్న హీరోయిన్ మాత్రం రాధిక గారు మాత్రమే… ఈమె చిరంజీవి తో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ గా కూడా పేరు తెచ్చుకుంది…

అయితే ఒక సినిమా షూటింగ్ లో భాగంగా రాధిక చిరంజీవి ని కొట్టే ఒక సీన్ లో తను ఎంత ప్రయత్నం చేసిన ఆ చెంప దెబ్బ కొట్టే షాట్ కరెక్ట్ గా రావట్లేదట దాంతో ఈ షాట్ ఎలా చేయాలి అని రాధిక బాగా టెన్షన్ పడుతున్నప్పుడు చిరంజీవి వచ్చి తోందరగా కొట్టండి అని నవ్వుతూ అన్నారట దాంతో అప్పటికే చాలా టెక్ లు తీసుకున్న రాధిక ఇక ఏం చేయాలో తెలీక కంగారులో గట్టిగా కొట్టిందట దాంతో చిరంజీవి చెంప కందిపోయి

ఎర్రగా మారిందట షాట్ ఒకే అయింది కానీ చిరంజీవిని కొట్టిన బాధల్లో ఉంది రాధిక అది గమనించిన చిరంజీవి అది పెద్ద దెబ్బ ఏం కాదు మీరేం బాధపడకండి అని చెప్పాడట ఇక అప్పటి నుంచి వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారట… ప్రస్తుతం చిరంజీవి హీరోగా సినిమాలు చేస్తుంటే రాధిక మాత్రం అటు సినిమాలు ఇటు సీరియల్స్ రెండు చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్నారు.రాధిక చాలా పెద్ద హీరోయిన్ గా ఇండస్ట్రీ లో చాలా రోజుల పాటు కొనసాగిన విషయం మనకు తెలిసిందే అలాగే టీవీ సీరియల్స్ లో కూడా తను టాప్ రేంజ్ ఆర్టిస్ట్ గా ముందుకు దూసుకెళ్తుంది…








