పుష్ప2 సినిమాకు ఫహద్ ఒక్కరోజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ఇంత తీసుకుంటున్నారా?

టాలీవుడ్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్( Allu Arjun ) రష్మిక మందన జంటగా నటించిన చిత్రం పుష్ప. 2021 లో విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామిని సృష్టించింది.పార్ట్ 1 పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి హిట్ అయ్యింది.

ఇక ఈ సినిమాలో చివరి పావుగంట విలనిజాన్ని చూపించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు ఫహద్ ఫాజిల్.( Fahadh Faasil ) ఈ సినిమాలో ఆయన నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి.

ఇకపోతే ఫహద్ ఫాసిల్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో( Pushpa 2 ) నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా ఫహద్ ఫాసిల్ సరిగ్గా డేట్స్ ఇవ్వని కారణముగా షూటింగ్ లేట్ అవుతుంది అన్నారు.ఇపుడు ఆయన డేట్స్ ఇవ్వడంతో ఆగ మేఘాల మీద పుష్ప 2 ని పూర్తి చేస్తున్నారట మూవీ మేకర్స్.

Advertisement

అయితే ఫాహద్ ఫాసిల్ పుష్ప ద రూల్ చిత్రానికి ఇంత అని రెమ్యునరేషన్( Remuneration ) తీసుకోవడం లేదు.ఆయన రోజుకి ఇంత అని ఫీజు వసూలు చేస్తున్నాడట.

ఫాహద్ ఫాసిల్ కాల్ షీట్స్ కి ఫుల్ డిమాండ్ ఉంది.

అందుకే ఆయన రోజుకి 12 లక్షల చొప్పున ఎన్ని రోజులైతే అన్ని 12 లక్షలు పుష్ప మేకర్స్ నుంచి పారితోషికంగా తీనుకుంటున్నాడట.తాను పుష్ప షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాక ఏదైనా ఇబ్బంది వచ్చి షూటింగ్ క్యాన్సిల్ అయినప్పటికి ఆయనకు ఇచ్చే 12 లక్షలు ప్లస్ మరో రెండు లక్షలు అదనంగా నిర్మాతల నుంచి ఛార్జ్ చేస్తున్నాడట.కారణం తన డేట్స్ ఎంత విలువైనవో అనేది ఈ పారితోషికం రూపేణా చెబుతున్నాడు.

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు మండిపడుతున్నారు.

నయనతారతో ఆ సినిమా చేసి తప్పు చేశా.. ప్రముఖ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు