Jaffer Sadiq : “విక్రమ్” చిత్రంలో సంతానం గ్యాంగ్ మెంబెర్ గా నటించిన మరగుజ్జు మనిషి రేంజ్ ఎంటో తెలుసా?

గత ఏడాది మనందరినీ ఎంతగానో అలరించిన చిత్రం "విక్రమ్".

( Vikram movie ) లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి( Vijay Sethupath ) ఫహద్ ఫాసిల్ వంటి స్టార్ హీరోలు నటించారు.

ఇంతమంది స్టార్ హీరోల మధ్య అందరి దృష్టిని ఆకర్షించిన పాత్ర ఒకటుంది.అదే సంతానం (విజయ్ సేతుపతి) గ్యాంగ్ లో ఉన్న ఒక మరగుజ్జు మెంబెర్ .ఇతను ఇప్పుడు తాజాగా విడుదలైన రజినీకాంత్ "జైలర్" చిత్రంలో కూడా ఒక ముఖ్య పాత్ర పోషించాడు.ఇప్పుడు ప్రేక్షకుల కళ్లన్నీ ఇతని మీదే.

మరి ఇంతకీ ఈ నటుడు ఎవరు? ఎక్కడినుంచి వచ్చాడు? అసలు ఇతని బాక్గ్రౌండ్ ఏంటి? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందా.

అతని పేరు "జాఫర్ సాదిక్".( Jaffer Sadiq ) ఈయన తమిళనాడు లోని ఈరోడ్ ప్రాంతానికి చెందిన వాడు.జాఫర్ 1995, జులై 4న జన్మించాడు.

Advertisement

ప్రస్తుతం తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో నటిస్తున్న ఇతను కేవలం నటుడు మాత్రమే కాదు.కొరియోగ్రహీర్ మరియు డాన్సర్ కూడా.

జాఫర్ "ఉంగలిల్ యార్ ప్రభుదేవా" అనే తమిళ డాన్స్ షో లో పాల్గొని 2 వ స్థానం పొందాడు.ఆ షో తో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.

ఆ తరువాత సొంతంగా ఒక డాన్స్ స్టూడియోను స్థాపించాడు.దాని పేరు "లిఫ్టదర్స్".అంతే కాదండి .ఈయన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ కూడా.ఈయనకు ఇంస్టాగ్రామ్లో 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.జాఫర్ అనేక ఈవెంట్స్ లో స్టేజి షోస్ కూడా చేసాడు.2018 లో ఆయన tedxGCT ఈవెంట్ లో చేసిన పెర్ఫార్మన్స్ ఆయన్ను పాపులర్ చేసింది.ఆ తరువాత సినిమాలలో నటించడం మొదలు పెట్టాడు.

నెట్ఫ్లిక్ లో విడుదలైన ఒక తమిళ్ సిరీస్ "పావ కధైగల్" నారికొట్టి గా నటించాడు.ఈ పాత్ర తో సినీ పరిశ్రమలో స్థానం సంపాదించాడు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

తరువాత లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ చిత్రం తో మొదటి సారి వెండి తెర మీద వెలిగాడు.ఇప్పుడు అట్లీ దర్శకత్వం లో వస్తున్నా "జవాన్" చిత్రంలో కూడా నటిస్తున్నాడని సమాచారం.

Advertisement

తాజా వార్తలు