బింబీసారా సినిమా కి దర్శకత్వం వహించిన ఈ హీరో ఎవరో తెలుసా

సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం ఉండి, అలాగే సినిమాల్లో హీరోగా రాణించాలని తాపత్రయం, ఇవన్నీ ఎవరినైనా సరే ఒక మెట్టు పైకెక్కించడానికి ఉపయోగపడతాయి.ఇండస్ట్రీకి రావడం ఒక అదృష్టం అయితే ఇక్కడ స్థానం సంపాదించుకొని ముందుకు సాగడం మన లక్కు అనే చెప్పుకోవాలి.

 Do You Know About Director Vashisht Vashisht , Kalyan Rama, Bimbisara, Prema La-TeluguStop.com

ఇండస్ట్రీ ఎవరికీ ఎర్ర తివాచీలు పరచదు.కష్టాల సాగరం ఈదాల్సిందే అది గట్టెక్కిన వాడే విజేత అవుతాడు.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా, దర్శకుడు విశిష్ట్ దర్శకత్వంలో వస్తున్న సినిమా బింబిసారా.ఈ చిత్రం ఫస్ట్ లుక్ నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ వరకు మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.

ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమాకి దర్శకుడుగా వశిష్ట్ తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. కానీ దర్శకుడుగా తొలి పరిచయమే అయినా కూడా వశిష్ట్ కి సినిమా ఇండస్ట్రీ కొత్తేమీ కాదు.ఇతడు హీరోగా కూడా ఇదివరకు ఒక సినిమాలో కనిపించాడు.15 ఏళ్ల క్రితం ఓ సినిమాలో నటించి అది సక్సెస్ కాకపోవడంతో దర్శకుడుగా మారి ప్రస్తుతం బింబిసారా సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

Telugu Anjali, Bimbisara, Vashisht, Kalyan Rama, Ravi Teja, Tollywood-Latest New

2007లో ప్రేమలేఖ రాశా అనే ఒక చిత్రంలో మల్లిడి వేణు అనే ఒక కుర్రాడు హీరోగా నటించగా, ఆ కుర్రాడే వశిష్ట్ ప్రస్తుతం బింబిశార సినిమాకు దర్శకుడిగా పని చేశాడు.ఈ చిత్రంలో అంజలి అనే ఒక అమ్మాయి హీరోయిన్ గా నటించింది.అయితే తను ఈ సినిమా తీసిన తర్వాత తాను హీరో మెటీరియల్ కాదని అర్థం అయిందని, అందుకే వెనక్కి వెళ్ళిపోయి కథలపై దృష్టి పెట్టానని, ఇటీవల మీడియాతో వశిష్ట్ చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత రవితేజ లాంటి హీరోకి కథ వినిపించినా కూడా అది వర్కౌట్ కాలేదని, ఇప్పటికే కళ్యాణ్ రామ్ కి రెండు కథలు వినిపించిన అవి కూడా కార్యరూపం దాల్చలేదని ప్రస్తుతం బింబీసార లాంటి ఒక గొప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం ఒక కలలాగా ఉందంటూ వశిష్ట్ చెప్పుకొచ్చాడు.ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ సైతం వశిష్ట్ గొప్పతనాన్ని పొగడటం చెప్పుకోదగ్గ విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube