ఆరు నెలల ఆలస్యంతో 'ఆదిపురుష్‌' కి పెరిగిన బడ్జెట్‌ ఎంతో తెలుసా?

ప్రభాస్ హీరోగా ఓమ్ రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదిపురుష్ సినిమా సంచలనాల మీద సంచలనాలు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ సినిమా ను నెట్‌ ఫ్లిక్స్ వారు ఏకంగా రూ.250 కోట్ల కు కొనుగోలు చేశారు అనేది తాజా సమాచారం.అది దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా చేసింది.

 Prabhas Adipurush Film Budget And Business , Adipurush, Adipurush Budget, Film N-TeluguStop.com

అంతకు మించి అన్నట్లుగా తాజాగా మరో వార్త ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతుంది.ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కు కూడా పెట్టనంత బడ్జెట్‌ ను ఈ సినిమా కు ఖర్చు చేస్తున్నారు.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.500 కోట్ల ను ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నట్లుగా మొదట్లోనే ప్రకటించారు.మొదట గా అనుకున్న ప్రకారం ఈ సినిమా ఈ ఆగస్టు లో రావాల్సి ఉంది.కాని కరోనా ఇతర కారణాల వల్ల సినిమా ను వచ్చే జనవరి లో విడుదల చేయాలని నిర్ణయించారు.

సినిమా ఆలస్యం అవ్వడం వల్ల బడ్జెట్‌ పెరగడం అనేది చాలా కామన్‌ విషయం.ఆది పురుష్‌ కు కూడా బడ్జెట్‌ భారీ గా పెరిగినట్లుగా సమాచారం అందుతోంది.

ఆది పురుష్ ఆలస్యం కారణంగా నిర్మాతలకు ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 125 కోట్ల రూపాయల బడ్జెట్‌ పెరిగిందని.జనవరి లో విడుదల కాకుంటే ఈ భారం మరింత గా పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

సినిమాకు ఉన్న బజ్‌ మరియు హైప్‌ నేపథ్యంలో వెయ్యి కోట్లు ఈజీగా ఈ సినిమా రాబతుంది అనేది ఇండస్ట్ర ఈ వర్గాల టాక్.కనుక ఆలస్యం అయినా పర్వాలేదు కనుక అద్భుతమైన ఔట్‌ పుట్‌ ను తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో దర్శకుడు ఓమ్‌ రౌత్ ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఈ సినిమా లో ప్రభాస్ కు జోడీగా కృతి సనన్ నటించగా కీలక పాత్రలో సైఫ్‌ అలీ ఖాన్‌ ఇంకా బాలీవుడ్‌ ప్రముఖ నటీ నటులు కనిపించబోతున్నారు.ఇది పూర్తిగా మోషన్ గ్రాఫిక్స్ టెక్నాలజీ తో రూపొందిస్తున్నామని ఓమ్‌ రౌత్‌ ప్రకటించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube