Akkineni Nageswara Rao: వార్ని.. ఏఎన్ఆర్ కు అలాంటి పిచ్చి ఉందా.. అదేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao ) గారు ఒకరు.

సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు ఇలా నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్ళు లాంటివారని.

వీరిద్దరూ ఇండస్ట్రీని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లారని చెప్పాలి.ఈ విధంగా నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ దాదాపు 75 సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి సేవలు చేసిన ఘనత ఏఎన్ఆర్ గారికి ఉంది.

ఇక ఈయన చివరిగా మనం సినిమాలో( Manam Movie ) నటించారు ఈ సినిమాలో అక్కినేని కుటుంబ సభ్యులందరూ కూడా భాగమయ్యారు.ఈ కుటుంబానికి మనం సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అద్భుతమైన సినిమా అని చెప్పాలి.ఇలా మనం సినిమా తర్వాత ఈయనకు పూర్తిగా అనారోగ్యం చేయడంతో ఇంటికి పరిమితమయ్యారు.

అనంతరం కొద్ది రోజులకే నాగేశ్వరరావు గారు మరణించారు.ఇక తాజాగా ఆయన శత జయంతి వేడుకలను కూడా నాగార్జున ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి మనకు తెలుస్తుంది.

Advertisement

అన్నపూర్ణ స్టూడియో అంటే నాగేశ్వరరావు గారికి ఎంతో ప్రాణమని తన తండ్రికి ఇష్టమైనటువంటి ప్రదేశంలోనే నాగార్జున( Nagarjuna ) ఆయన విగ్రహాన్ని ప్రతిష్టింపచేశారు.ఇలా విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా జరిగింది.ఈ విధంగా ఏఎన్ఆర్ శతజయంతి వేడుకలలో భాగంగా నాగేశ్వరరావు గారికి సంబంధించినటువంటి ఒక వార్త ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది.

నాగేశ్వరరావు గారికి ఒక అలవాటు ఉండేదట ఆయనకు కొయ్య బొమ్మలంటే అమితమైన ప్రాణం అని తెలుస్తుంది.

ఈ విధంగా కొయ్య బొమ్మలంటే( Handicrafted Toys ) ఎంతో ప్రాణం ఇచ్చే నాగేశ్వరరావు షూటింగ్ నిమిత్తం ఎక్కడికి వెళ్లినా ఆ ప్రాంతంలో ఎక్కడైనా కొయ్యి బొమ్మలు కనుక దొరికితే వెంటనే వాటిని తెచ్చి ఇంట్లో అలంకరించే వారట.ఈ విధంగా నాగేశ్వరరావు కొనుగోలు చేసినటువంటి ఎన్నో రకాల కొయ్య బొమ్మలు ఇప్పటికీ తన గదిలో భద్రంగానే ఉన్నాయని తెలుస్తది.ఇక నాగేశ్వరరావు దగ్గర డబ్బులు లేకపోయినా ఉన్న డబ్బును కూడా కొయ్య బొమ్మలకే ఖర్చు చేసి కొనుగోలు చేసేవారట .అంతలా ఈయనకు కొయ్య బొమ్మలంటే ప్రాణమని తెలుస్తోంది.ఈయనతో పాటు తన భార్య అన్నపూర్ణకు కూడా బొమ్మలంటే ప్రాణం కావడంతో ఎంతో చక్కగా బొమ్మలు తీసుకొని ఇల్లు మొత్తం అందంగా అలంకరించుకునే వారట.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు